Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీల దాడులు జరుగుతన్నాయంటే అక్కడ పట్టించుకునే ప్రభుత్వమే లేదు. తాజాగా తనను నిరాకరించందనే కోపంతో హిందూ బాలికను అత్యంతదారుణంగా హత్య చేశాడో ముస్లిం వ్యక్తి. బంగ్లాదేశ్ లోని తూర్పు జిల్లా నేత్రకోనాలోని బర్హట్టా సబ్ డిస్ట్రిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ముక్తి బర్మన్ (16) అనే హిందూ బాలికను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు.
ముక్తిబర్మన్ స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నిందితుడు కౌసర్ మియా బాలికపై దాడి చేసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ్ నగర్ సాలిపుర ఉన్నత పాఠశాలలో బాధితురాలు పదో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కౌసర్ మియా అడ్డగించి కత్తితో పొడిచాడు. ఆమెను బర్హట్టా ఆస్పత్రికి తరలించి ప్రథమి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నేత్రకోనాలోని మోడ్రన్ సదర్ ఆస్పత్రికి, అక్కడ నుంచి మైమెన్‌సింగ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Read Also: Medaram: మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు
బర్మన్ తన స్నేహితులతో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పాఠశాల నుంచి బయలుదేరారు. స్కూల్ నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న చలిపురా ప్రాంతానికి చేరుకున్న తర్వాత, కౌసర్ మియా, ముక్తి బర్మన్ ను అడ్డగించాడు. ఆ తరువాత కత్తితో తీవ్రంగా దాడి చేసి గాయపడ్డారు. స్థానికులు ముక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రేమ్‌నగర్ చలిపురా హైస్కూల్ ప్రిన్సిపాల్ అబుల్ ఖైర్ అకాంద్ మాట్లాడుతూ.. ముక్తి కుటుంబం చాలా పేదదని, అమ్మాయి చదువుల్లో చురుకుగా ఉంటుందని, నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముక్తి గ్రామానికి చెందిన నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.
తన మేనకోడలు స్కూల్ కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో చాలా కాలంగా నిందితుడు వేధిస్తున్నాడని ముక్తి మామ లిటన్ బర్మన్ తెలిపారు. ఈ విషయాన్ని కౌసర్ కుటుంబానికి కూడా తెలియజేశామని ఆయన వెల్లడించారు. నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.