Amazon Begins Mass Layoffs: టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, మెటా వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగింపును ప్రారంభించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు యూఎస్ మీడియా నివేదికలు బుధవారం వెల్లడించాయి. చాలా సమీక్షల తర్వాత మేము ఇకపై కొందరి అవసరం ఉండదని భావిస్తున్నామని హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం ఉద్యోగులకు ఇచ్చిన మెమోలోమ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతామని మాకు తెలుసు కాబట్టి ఈ వార్త తెలపడం బాధగా ఉందని అన్నారు.
Read Also: ICC T20I Rankings: నంబర్ వన్ స్థానం సూర్యకుమార్ యాదవ్‌దే..
సుమారుగా 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ ఆలోచిస్తున్నట్లు న్యూయర్క్ టైమ్స్ తెలిపింది. కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద తొలగింపులను పేర్కొంది. తన వర్క్ ఫోర్స్ లో 3 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించింది. ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా 11 వేల మందిని తొలగించింది. ఆర్థిక మాంద్య భయాలు, ఆదాయం తగ్గడంతో పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. తాజాగా అమెజాన్ కూడా 10 వేల మందిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టింది.
వీటి బాటలోనే మరికొన్ని సంస్థలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ కూడా తొలగింపు ప్రక్రియలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం లేకపోవడంతో ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి చాలా సంస్థలు. ఈ తొలగింపులు ఇండియా ఐటీ నిపుణులపై ప్రభావం చూపిస్తోంది. 2022లో 52 వేల మందికిపైగా సాఫ్ట్వేర్ నిపుణులను అమెరికన్ కంపెనీలు తొలగించాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. కొందరికి ఆఫర్ లెటర్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇక ఈ పరిస్థితులు ఇండియన్ కంపెనీలపై ఏవిధంగా ఉంటుందో.. అని మన ఉద్యోగాల పరిస్థితి ఏమిటో అని ఇండియన్ ఐటీ నిపుణులు భయపడుతున్నారు.