Shraddha Walker case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల అమ్మాయిని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. అత్యంత క్రూరంగా గొంతుకోసి శరీరాన్ని 35 భాగాలు చేసి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసరల ప్రాంతాల్లో శరీర భాగాలను పారేశాడు. ఆరు నెలల క్రితం హత్య జరిగినా.. ఈ కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఢిల్లీ పోలీసులు నిందితులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేసులో అఫ్తాబ్, శ్రద్ధావాకర్ ని అంతకన్నా ముందే హత్య చేయాలని భావించినట్లు తెలుస్తోంది. నిందితుడు అఫ్తాబ్ చెప్పిన వివరాల ప్రకారం మే 18న శ్రద్ధాను హత్య చేశారు. అయితే దీని కన్నా ఓ 10 రోజుల ముందే ఆమెను హత్య చేయాలని చూశాడు నిందితుడు. అయితే ఆమె చాలా ఎమోషనల్ అని అందకే చంపలేకపోయానని వెల్లడించాడు. హత్యకు కొన్ని రోజుల ముందు ఇద్దరు తీవ్రంగా గొడవపడ్దారని.. అయితే శ్రద్ధా ఎమోషనల్ అయి ఏడవడంతో హత్య చేసేందుకు వెనకాడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్ తనను మోసం చేశాడని.. మరో మహిళలో మాట్లాడుతున్నాడని ఇద్దరూ గొడవపడ్డారు.
Read Also: LIfe Span of Honeybees: తేనె బతుకు.. 50 ఏండ్లలో 50 శాతం తగ్గింది!
డేటింగ్ యాప్ లో పరిచయం అయిన వీరిద్దరు గత మూడేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే అఫ్తాబ్ మాత్రం శ్రద్ధాను కాదని వేరే అమ్మాయితో కూడా చనువుగా ఉండే వాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కావడంతో మే18న అఫ్తాబ్, శ్రద్ధా ఛాతిపై కూర్చోని గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఆ తరువాత ఒక్కొక్కటిగా శరీరభాగాలను వివిధ ప్రదేశాల్లో పారేశాడు. మృతదేహం నుంచి తలను వేరు చేసి విడిగా చుట్టినట్లు.. ప్రతీ రోజు తలవైపు చూసేవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం పోలీసులు, అఫ్తాబ్ ను దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లోకి తీసుకెళ్లారు. సుమారు 10 బ్యాగుల్లో శరీర అవయవాలు లభ్యం అయ్యాయి. వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం పంపించారు. అఫ్తాబ్, శ్రద్ధా వాకర్ ముంబై విడిచిపెట్టి వచ్చిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా చాలా ప్రదేశాల్లో గడిపారని.. ఆ తరువాత ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉన్నారు. మే 15న ఛత్తర్ పూర్ అపార్ట్మెంట్ కు మారారు. ఇలా వచ్చిన మూడు రోజుల తర్వాత మే 18న శ్రద్ధావాకర్ ని అత్యంత దారుణంగా హత్య చేశాడు.