Physical assault on Kerala model: కేరళలో దారుణం జరిగింది. 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు యువకులతో పాటు ఒక మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్లాన్ ప్రకారం యువ మోడల్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కొడంగల్లూర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కాసర్ గోడ్ కు చెందిన యువతిపై కారులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
All Supreme Court Benches To Hear 10 Matrimonial Cases, 10 Bail Pleas Each Day: వివాహ వివాదాలకు సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3000 మ్యాట్రిమోనల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిని విడతల వారీగా తగ్గించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రతీ రోజూ సుప్రీంకోర్టు అన్ని బెంచ్‌లు 10 మ్యాట్రిమోనియల్ కేసులు, 10 బెయిల్ పిటిషన్లను విచారించనుంది. కొన్ని కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన ప్రదేశానికి కేసులను బదిలీ చేయాలని కోరుతున్నాయని…
20 Killed After Bus Falls Into Water-Logged Ditch In Pakistan's Sindh: పాకిస్తాన్ దేశంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్ సింధు ప్రావిన్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నీటి గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. 14 మంది గాయపడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారీ వరదల్లో పాకిస్తాన్ లోని రహదారులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో నీటితో పెద్ద పెద్ద కాలువలు,…
Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు
Delhi Lt Governor Acts Against Official Amid Row With AAP: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా ఎల్జీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఓ ఉన్నతాధికారి కార్యాలయాని తాళం వేయాల్సిందిగా ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్(డీడీసీ) వైస్ చైర్పర్సన్ జాస్మిన్ షా తన కార్యాలయాన్ని ఉపయోగించకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు…
PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం లేదని అన్నారు. యూనిఫాం జీరో టాలరెన్స్…
Elon Musk's tweet on employee resignation: ట్విట్టర్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ ని టేకోవర్ చేసుకున్న తరువాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఇదే విధంగా కంపెనీ కోసం "హార్డ్‌కోర్"గా కష్టపడేవారు, పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచించాడు మస్క్. లేకపోతే ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లవచ్చని సూచిస్తూ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించారు. అయితే ఎలాన్ మస్క్ వార్నింగ్ తో ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా…
India slams Pakistan for raking up Kashmir issue at UN: మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ అబద్దాలను ప్రచారం చేయడానికి తెగించి ప్రయత్నాలు చేస్తుందంటూ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగంగా ఉందని యూఎన్ లో భారతదేశ శాశ్వత…
Police Complaint Against Rahul Gandhi Over Savarkar Remarks: వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన వీర్ సావార్కర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రేతో పాటు సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీపై శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం నేత వందనా డోగ్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్ సావర్కర్ పై వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర…
Ukraine in the dark. Russian attack on power system: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా రష్యా దాడుల ఫలితంగా ఉక్రెయిన్ లో అంధకారం నెలకొంది. దేశంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కోటి మంది ఉక్రెయిన్లకు విద్యుత్ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం అన్నారు. ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. విద్యుత్ సరఫరాను…