Parents must keep track of their daughters, Kiran Bedi on Shraddha’s murder: పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్లపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగుపొరుగు వారు, ఆమె నివసించి ఫ్లాట్ యజమాని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
Read Also: Password: మన దేశంలో ఎక్కువ మంది వాడుతున్న పాస్‌వర్డ్ ఏంటో తెలుసా?
మొత్తం కుటుంబం నష్టపోయిందని ఆమె అన్నారు. ఇది సమాజ వైఫల్యం అని.. స్నేహితులు కూడా విఫలం అయ్యారని కిరణ్ బేడీ అన్నారు. అమ్మాయిలకు భరోసా ఇవ్వడం కుటుంబం పాత్ర ముఖ్యమని తెలిపారు. డేటింగ్ యాప్ లో అఫ్తాబ్ ఎంతగా నిమగ్నం అయి ఉన్నాడో అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఓ రకంగా నేరానికి దారి తీసిన పరిస్థితులను శ్రద్ధా చూసిందని ఆమె చెప్పారు.
అమ్మాయిలు ధైర్యంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని.. జీవితంలో ఛాలెంజెస్, రియాలిటీల గురించి తల్లిదండ్రులు చెప్పాలని అన్నారు.
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి శ్రద్ధావాకర్ ని, అఫ్తాబ్ పూనవాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య జరిగిన 6 నెలల తర్వాత ఈ భయంకరమైన నేరం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి 18 రోజులు పాటు రాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారేశాడు. 2019 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు సొంత నగరం ముంబైని వదిలి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. మే 18 పెళ్లి గురించి ఇద్దరి మధ్య గొడవ కావడంతో శ్రద్ధాను గొంతు కోసి చంపాడు అఫ్తాబ్. ఆరు నెలల తర్వాత తన కూతురు కనిపించడం లేదని శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.