Jama Masjid bans entry of women who come without men: దేశంలోని సుప్రసిద్ధ ఢిల్లీలోని జామా మసీదు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మహిళలు, బాలికలు మసీదులోకి రాకుండా వారి ప్రవేశంపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. మసీదు నిర్వాహకులు బాలికలు, మహిళలు ఒంటరిగా కానీ గుంపుగా కానీ మసీదులోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ గేట్లపై నోటీసులు అంటించారు. మసీదుకు రావాలంటే వారి కుటుంబంలోని పురుషుడు తప్పని సరి అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. అయితే దీన్ని పరిష్కరించేందుకు జామా మసీదు…
Pakistan's New Army Chief Is Lieutenant General Asim Munir: దాయాది దేశం పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను గురువారం నియమించింది పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ నెలఖారులో ప్రస్తుతం సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ బాధ్యతలను తీసుకోనున్నారు. గత ఆరేళ్లుగా పాక్ సైన్యాధ్యక్షుడిగా బజ్వా అన్నారు. మునీర్ గతంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చీఫ్ గా పనిచేశాడు.…
Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇ-కామర్స్…
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని…
Twin blasts at bus stops shake Jerusalem, over 15 injured: ఇజ్రాయిల్ జంట పేలుళ్లతో వణికింది. జెరూసలేంలోని బస్ స్టాపులే టార్గెట్‌గా వరసగా రెండు పేలుళ్లు జరిగాాయి. నగరం శివారులో ఉన్న బస్ స్టాండ్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో 15 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవలను మోహరించారు. సిటీ వెస్ట్రన్ ఎగ్జిట్…
NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టిమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా ఓరియన్ తన మొదటి మూన్ ఫ్లైబైని…
UP Hospital Doctors Refused To Touch HIV+ Woman, She Lost Baby: డాక్టర్ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ప్రవర్తించారు. వైద్యం కోసం వచ్చి హెచ్ఐవీ పాజిటివ్ మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారు. కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. గర్బిణి అనే కనికరం లేకుండా వ్యవహారించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ వైద్యం కోసం సమీపంలోని ఫిరోజాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆమెకు హెచ్ఐవీ…
Multiple fatalities in shooting at US Walmart store: అమెరికాలో కాల్పుల మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని ఓ వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. వర్జీనియాలోని చీసాపీక్ లోని వాల్ మార్ట్ కాల్పుల్లో అనేక మంది మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మాల్ మార్ట్ లో మేనేజర్ గా చేస్తున్న వ్యక్తే…
Drug addict stabs four members of his family to death: ఢిల్లీలో దారుణం జరిగింది. సొంత కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, సోదరి, అమ్మమ్మ ఉన్నారు. డ్రగ్స్ కు బానిసైన కేశవ్(25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, అమ్మమ్మను హత్య చేశాడు. కొన్ని రోజలు క్రితమే కేశవ్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్…
HP plans to layoff 12 per cent of its global workforce over the next few years: కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసులను అందించే ప్రముఖ కంపెనీ హెచ్‌పీ త్వరలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని తెలుస్తోంది. హెచ్‌పీ 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు చెబుతున్నట్లే హెచ్‌పీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్, మెటా,…