Akhanda 2 3D Show: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు ఒక 3D థియేటర్‌లో అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో ను దర్శకుడు బోయపాటి శ్రీను చూశారు. అభిమానులతో కలిసి డైరెక్టర్ బోయపాటి సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ ALSO: Flex by Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..
‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. సనాతన ధర్మం, దేశభక్తి, ఆధ్యాత్మికత ఈ మూడు కలగలిపి తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం బాలయ్య అభిమానులతో పాటు, సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త మేనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం ప్రధాన బలంగా పని చేసింది. ఇప్పటి వరకు డైరెక్టర్ బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘BB5’ (బాలకృష్ణ-బోయపాటి 5వ సినిమా) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027లో షూటింగ్‌కు రానున్నట్లు సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది.
READ ALSO: Palanadu Accident Case: ఐదుగురి మృతి కేసులో కీలక మలుపు.. నిందితులకు పోలీసుల కస్టడీ
Blockbuster director #BoyapatiSreenu watched #Akhanda2 in 3D at the PCX screen along with the audience. 🔥🔥#BlockbusterAkhanda2 pic.twitter.com/6HhCARvEtN
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 17, 2025