AAP satires on BJP's defeat: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎంతో కీలకంగా భావించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టింది చీపురు పార్టీ. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంటే, బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ 126…
Union Minister Prahlad Joshi Clarity in Parliament on Privatization of Singareni: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికే వాటా ఉందని.. అలాంటప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని…
Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
CM KCR Clarity on Rythu Bandhu: రైతులుకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. బుధవారం జగిత్యాల పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు.
Tiger Found Hanging By Neck In Madhya Pradesh Tiger Reserve: మధ్యప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్ లో ఓ పులి మరణించింది. వేటగాళ్లు అమర్చిన ఉక్కుకు చిక్కినట్లుగా తేలుస్తోంది. పులి గొంతుకు ఉచ్చు బిగుసుకుపోవడంతో పులి చనిపోయింది. మంగళవారం రాత్రి విక్రమ్ పూర్ అడవుల్లో మగపులి చనిపోయి ఉండటంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం సంఘటన స్థలాని చేరుకుని చూడగా.. చెట్టుకు వేలాడుతూ పులి మృతదేహం ఉంది. పులి మెడకు వాహనాల్లో వాడే క్లచ్ వైర్ చుట్టుకుని చెట్టుకు వేలాడుతూ…
AAP's big win in Delhi Municipal Corporation elections: ఢిల్లీ ప్రజలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీని ఆప్ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. బీజేపీ కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ)ని చీపురు పార్టీ గెలుచుకుంది. మొత్తం 250 స్థానాలు ఉన్న డీఎంసీ ఫలితాలు వెల్లడయ్యాయి. 134 వార్డులను ఆప్ గెలుచుకోగా.. 104 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా అంచానా వేసిన విధంగా అయితే…
Arvind Kejriwal's reaction to Delhi's victory: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గండికొట్టింది. ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విజయంపై ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకుంటున్నారు.
Border issue between Karnataka and Maharashtra: కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది ఈ వివాదం. ఇప్పటికే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కర్ణాటక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యలకు బెలగావి కేంద్రంగా మారింది. అయితే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు…
Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం.
Gujarat Cleric Slams Muslim Women In Elections: ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసేవారు ఇస్లాంకు వ్యతిరేకం వ్యతిరేకంగా మతాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రెండో విడత ఎన్నికలకు ముందు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన జామా మసీద్ మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఇస్లాంలో నమాజ్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, మసీదుల్లో మహిళలు నమాజ్ చేయడం ఎప్పుడైనా చూశారా..? అంటూ ప్రశ్నించారు.…