Gujarat and Himachal Pradesh election results today: దేశవ్యాప్తంగా ఉత్కంఠతకు నేడు తెరపడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు అన్ని పార్టీలకు, దేశప్రజలకు ఆసక్తి నెలకొంది. ఢిల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో…
Objectionable Video Of Rajasthan Minister Goes Viral, BJP Demands Sacking: రాజస్థాన్ మంత్రి బూతు వీడియో ఒకటి వైరల్ గా మారింది. బాధ్యయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యకరంగా వీడియోకాల్ లో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడం ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి వర్గంలో ఉన్న మైనారిటీ వ్యవహారాల మంత్రి సలేహ్ మహ్మద్ ఈ వీడియోలో ఓ అమ్మాయి లోదుస్తులతో ఉండగా వీడియో చాట్ చేయడం […]
Iranian students 'intentionally' poisoned before mass protest: ఇరాన్ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. 22 ఏళ్ల అమ్మాయి మహ్సా అమినిని హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయింది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, విద్యార్థులు హిజాబ్ కు, మోరాటిటీ పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు…
Ukraine's Volodymyr Zelenskyy is TIME Person of the Year: అత్యంత శక్తివంతమైన రష్యాను ధిక్కరించి యుద్ధంలో ఉక్రెయిన్ దేశాన్ని రష్యాకు ధీటుగా నిలబెట్టినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ఈ ఏడాది ‘‘టైమ్స్ పర్స్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపికయ్యారు. రష్యా యుద్ధంతో తన దేశాన్ని ఎదురొడ్డి నిలిచేలా చేసిన జెలన్ స్కీ ధైర్యాన్ని టైమ్స్ మ్యాగజీన్ ప్రశంసించింది. ధిక్కరణ, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఎదిగారని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్ అన్నారు. స్వేచ్ఛను రక్షించడానికి ప్రజల్ని ఉత్సాహపరిచడం…
Nirmala Sitharaman, 5 Other Indians Among Forbes' 100 Most Powerful Women: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయ మహిళలకు చోటు దక్కింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2022కు సంబంధించి ఈ జాబితాలో కేంద్రమంత్రితో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా, నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్లు ఆరుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలోొ నిర్మలా సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో 37వ స్థానంలో, 2020లో…
Saudi Crown Prince Mohammed bin Salman: సౌదీ సంతతికి చెందిన యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో సౌదీ యువరాజుకు మినహాయింపులు ఉన్నాయమని జో బైనెన్ యంత్రాంగం పట్టుబట్టడంతో ఈ కేసును కొట్టేసింది న్యాయస్థానం. కొలంబియా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ డీ బేట్స్, మహ్మద్ బిన్ సల్మాన్ కు ఈ కేసు నుంచి రక్షణ కల్పిస్తున్న నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్నారు.
AAP satires on BJP's defeat: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎంతో కీలకంగా భావించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టింది చీపురు పార్టీ. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంటే, బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ 126…
Union Minister Prahlad Joshi Clarity in Parliament on Privatization of Singareni: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికే వాటా ఉందని.. అలాంటప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని…
Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
CM KCR Clarity on Rythu Bandhu: రైతులుకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. బుధవారం జగిత్యాల పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు.