5 Cops Suspended For Stealing Diesel From Police Vehicles In Madhya Pradesh: దొంగతనాలు, దోపిడీల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఏదైనా అన్యాయం జరిగితే ముందుగా సామాన్యుడు ఆశ్రయించేది పోలీసులనే. అయితే అలాంటి పోలీసులే దొంగతనానికి పాల్పడితే.. నిజంగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఏకంగా సొంత పోలీస్ వాహనాల నుంచే డీజిల్ దొంగిలించారు. పోలీస్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేస్తే తెలియదని అనుకున్నారేమో కానీ చివరకు దొంగతనం బయటపడింది.
Himanta Sarma Responds To B Ajmal's hindu Remarks: హిందూ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన అస్సాం పొలిటికల్ లీడర్ బద్రుద్దీన్ అజ్మల్ పై విరుచుకుపడ్డారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పిల్లలు జన్మించడం, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. హిందువులు ముస్లిం ఫార్మలాను అనుసరించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అజ్మల్. సోమవారం అజ్మల్ సొంత నియోజకవర్గం అయిన ధుబ్రీకి సమీపంలోని బొంగైగావ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో అజ్మల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వ శర్మ.
Time To Take PoK Back, says Congress Leader Harish Rawat: పాకిస్తాన్ ఆధీనంలో కాశ్మీర్ ప్రాంతంపై ఇటీవల కాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు మన సైనికాధికారులు కూడా పీఓకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని కామెంట్స్ చేశారు. అయితే ఈ కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని అన్నారు.
BJP Retains Gujarat, Himachal: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి.
Big Win For AAP In Delhi Municipal Election, Show 2 Exit Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ స్వీప్ చేయబోతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
64,000 Babies Die In Womb Every Year Because Of Polluted Air In China: చైనాలో కాలుష్యం తీవ్రత అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుకపై ప్రభావం కనిపిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలోనే పిండం మరణించే దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది అక్కడి 64,000 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నారు. దీనంతటికి చైనా వ్యాప్తంగా ఉన్న కాలుష్యమే కారణం అని తెలిసింది. రాజధాని బీజింగ్ లో…
Everyone in India has right to choose their God, says Supreme Court: భారతదేశంలో ప్రతీ ఒక్కరికి వారి ఇష్ట ప్రకారం దేవుడిని ఎంచుకుని హక్కు ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ ఆధ్యాత్మిక వ్యక్తిని పరమాత్మగా, సర్వోన్నత వ్యక్తిగా ప్రకటించాలని కోరతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. భారతదేశం లౌకికదేశం అని.. భారత పౌరులు శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మగా అంగీకరించాలని వేసిన కేసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. న్యామయూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, సీటీ…
Muslims Boycott Polls In Gujarat Village: గుజరాత్ లో రెండో విడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత డిసెంబర్ 1న పూర్తవగా.. నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలోని ముస్లింలు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు.
Extreme tension in Jogipet.. Clash between Congress and TRS: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వేడుకలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రాజనర్సింహ బర్త్ డే సందర్భంగా జోగిపేట బైపాస్ రోడ్డులో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేశార. అయితే ఈ ర్యాలీ తీస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను జెండా కర్రలతో చితకబాదారు. ఈ దాడిపై…
Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేసేందుకు…