Tiger Found Hanging By Neck In Madhya Pradesh Tiger Reserve: మధ్యప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్ లో ఓ పులి మరణించింది. వేటగాళ్లు అమర్చిన ఉక్కుకు చిక్కినట్లుగా తేలుస్తోంది. పులి గొంతుకు ఉచ్చు బిగుసుకుపోవడంతో పులి చనిపోయింది. మంగళవారం రాత్రి విక్రమ్ పూర్ అడవుల్లో మగపులి చనిపోయి ఉండటంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం సంఘటన స్థలాని చేరుకుని చూడగా.. చెట్టుకు వేలాడుతూ పులి మృతదేహం ఉంది. పులి మెడకు వాహనాల్లో వాడే క్లచ్ వైర్ చుట్టుకుని చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
Read Also: Flora Saini: శ్రద్దా వాకర్ లా నేను కూడా చావాల్సిందాన్ని.. బట్టలు కూడా లేకుండా పరిగెత్తా
సాధారణంగా ఇలాంటి వైర్లను జంతువులను వేటాడేందుకు ఉచ్చుగా ఉపయోగిస్తారు వేటగాళ్లు. ఈ ఉచ్చును గ్రామస్తులు వేరే జంతువులను పట్టుకోవడానికి వేశారని.. ప్రమాదవశాత్తు పులి ఈ ఉచ్చులో చిక్కినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర టైగర్ స్ట్రైక్ ఫోర్స్‌తో పాటు సాత్నా నుండి డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ ప్రాథమిక అంచనాలతో పులి మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో గ్రామస్తులను సహకరించాలని కోరుతున్నామని అటవీ అధికారులు వెల్లడించారు. పులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ మొత్తం 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 15 నుంచి 32 పులులు ఈ టైగర్ రిజర్వ్ లో ఉన్నాయి. కన్హా, బాంధవ్ ఘర్, పెంచ్, సత్పురా, పన్నా, సంజయ్ దుబ్రి అనే ఆరు టైగర్ రిజర్వులు కూడా మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇటీవల వరసగా పులులు మరణిస్తున్నాయి. ఈ ఘటనలకు ముందు మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ లో కొన్ని రోజుల వ్యవధిలోనే 6 పులులు మరణించాయి.