గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పార్టీల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.
BJP on the way to a huge victory in Gujarat elections: గుజరాత్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించే దిశగా వెళ్తోంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉంటే.. బీజేపీ ఏకంగా 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ దారుణంగా చతికిల పడింది కేవలం 19 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ 150 కన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని…
AAP became a national party: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చరిత్ర సృష్టించింది. జాతీయ పార్టీ హోదాను సంపాదించుకుంది. గుజరాతీల ఓట్లే ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం అన్నారు. ‘‘ గుజరాత్ ప్రజల ఓట్లతోనే నేడు ఆప్ జాతీయపార్టీగా అవతరిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో విద్యా, ఆరోగ్య రాజకీయాలతో ముద్ర వేస్తున్నామని.. ఇందుకు దేశానికి అభినందనలు అని ఆయన అన్నారు. ఆప్ జాతీయ ఆశయాలకు "జాతీయ పార్టీ" అనే…
Indian Soldier Accidentally Crosses Border, Captured By Pakistan: అనుకోకుండా సరిహద్దు దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) జవాన్ ని నిర్భంధించింది పాకిస్తాన్. సరిహద్దు దాటడంతో పాక్ రేంజర్లు అన్ని పట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. పంజాబ్ సెక్టార్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. అతన్ని భారత్ కు అప్పగించడం కోసం వేచి చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇలా అనుకోకుండా బోర్డర్ క్రాస్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత వారం డిసెంబర్ 1న భారత్-పాకిస్తాన్ బోర్డరో లో జీరో…
Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉంటే 35…
Amazon Plans To Sack 20,000 Employees: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Annamalai criticized Udayanidhi Stalin as a playboy: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ..‘క్రౌన్ ప్రిన్స్ ప్లే బాయ్ గానే మిగిలిపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ప్లేబాయ్ గానే మిగిలిపోతాడంటూ విమర్శించారు. అన్నూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నామలై, డీఎంకే టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా డీఎంకే…
Massive Fire In Pakistan's Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపుగా 300 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇస్లామాబాద్ లోని ప్రముఖ సండే బజార్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో దుకాణాలు, స్టాళ్లు అగ్నికి దగ్ధమయ్యాయి. సెకండ్ హ్యాండ్ బట్టలు, కార్పెట్లను విక్రయించే బజాల్ లోని గేట్ నంబర్ 7 సమీపంలో మంటలు ప్రారంభం అయ్యాయి. భారీగా ఎగిసిపడిన మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు గంటల తరబడి శ్రమించాయి. పాకిస్తాన్ వైమానిక…
Jabalpur Bride Gets Beautician Arrested For Messing Her Make-Up: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి కూతురుకు సకాలంలో మేకప్ చేయకుండా.. దురుసుగా ప్రవర్తించినందుకు బ్యూటీషియన్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన జబల్ పూర్ లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వివారాల్లోకి వెళితే.. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం పెళ్లి కూతురుకు మేకప్ చేయకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడింది ఓ బ్యూటిషియన్. జబల్ పూర్ నగరంలోని ఘమాపూర్ ప్రాంతానికి చెందిన వధువుకు డిసెంబర్…
Taliban Publicly Execute Murder Accused, First After Afghanistan Takeover: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగ మరణశిక్షను విధించింది. హత్య నిందితులను బహిరంగంగా శిక్షించింది. పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో 2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు.