AAP satires on BJP’s defeat: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎంతో కీలకంగా భావించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టింది చీపురు పార్టీ. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంటే, బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ 126 స్థానాలను క్రాస్ చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇక ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉండనుంది.
Read Also: UP Girl Case: 2015లో హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత బతికొచ్చింది
ఇదిలా ఉంటే బీజేపీ, ఆప్ ల మధ్య వార్ మొదలైంది. చిన్న పార్టీ అయిన ఆప్, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ఓడించిందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్ధా సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రోడ్డుపై చెత్త ఊడుస్తూ.. అక్కడే పడి ఉన్న బీజేపీ జెండాను కూడా ఊడవడాన్ని ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ ప్రజలు చెత్త(బీజేపీ)ని ఊడ్చేశారంటూ కామెంట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేసింది.
दिल्लीवालों ने कचरे (भाजपा) पर झाड़ू चला दी 🔥#MCDMeinBhiKejriwal pic.twitter.com/cKws2mQW9h
— AAP (@AamAadmiParty) December 7, 2022
ఇదిలా ఉంటే ఈ ట్వీట్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనికి రిప్లైగా బీజేపీ కార్యకర్తలు ఓ వీడియోను పోస్టు చేశారు. బీజేపీ నేత సునీల్ థియోధర్ ఓ కాలనీలో వెళ్తూ కింద పడి ఉన్న కాంగ్రెస్ జెండాలను పక్కకు వేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇది బీజేపీకి ఆప్ కు ఉన్న తేడా అంటూ బీజేపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/kashmiriRefuge/status/1600449699852394496