Man Acquitted In Rape Case Seeks ₹ 10,000 Crore Damage For 2-Year Jail: అత్యాచారం కేసులో తనను అన్యాయంగా రెండేళ్లు శిక్షించారని ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెట్టాడు ఓ వ్యక్తి. నిర్దోషిని అయిన తనను రెండేళ్ల పాటు శిక్షించాలని ప్రభుత్వం తనకు రూ. 10,006.02 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోరాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ కు చెందిన ఓ వ్యక్తి సామూహిక అత్యాచారం ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే రెండేళ్ల పాటు శిక్ష అనుభవించాడు. తన కుటుంబానికి బాధ…
Forest Official Stops Commuters To Let Tigers Cross Road In Maharashtra: పులులు రోడ్డు దాటేందుకు అటవీ అధికారి రోడ్డుపై ప్రయాణికుల వాహనాలను ఆపేశారు. ఈ ఘటన మహరాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1300 వ్యూస్ దక్కించుకుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను మిలింద్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Sonia Gandhi admitted to Delhi's Ganga Ram Hospital for medical checkup: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో చేరారు. సోనియాగాంధీతో ఆమె కుమార్తె పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వెంట ఉన్నారు. 76ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రొటీన్ చెకప్ కోసం వచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతున్నారు. మంగళవారం నుంచి అస్వస్థతలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం యూపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో…
Covid Update: చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెరగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7తో చైనా అల్లాడుతోంది. అక్కడి రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ నెలలో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Pakistan unemployment: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర నిరుద్యోగం నెలకొంది. ఎంతలా అంటే సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షను క్లాస్ రూముల్లో నిర్వహిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం కానిస్టేబుల్ రాత పరీక్షను ఏకంగా ఓ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చింది. అంటే అంతలా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఇస్లామాబాద్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,667 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం ఇస్లామాబాద్ లో రాత పరీక్ష జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ పరీక్షను ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. స్టేడియంలో కూర్చోని…
Economic Slowdown In These 3 Countries Will Impact The World In 2023 says IMF: ప్రపంచదేశాలు ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు, అమెరికా, చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఒక్క భారతదేశ ఆర్థిక పరిస్థితి మాత్రమే బాగుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు శ్రీలంక…
Supreme Court Upholds Centre's Note Ban Move: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
Nitish Kumar comments on Rahul Gandhi's Prime Ministerial candidacy: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయి. చాలా మంది నేతలు ప్రధాని పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్, మమతాబెనర్జీ వంటి నేతలు ప్రధాని ఆశల్లో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్…
Terrorist firing in Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ లో రాజౌరీ ఉగ్రవాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజౌరీలోని హిందువుల ఇళ్లకు చొరబడి కాల్పులు ప్రారంభించారు ముష్కరులు. ముందుగా వారి ఐడెంటిటీని గుర్తించేందుకు వారి ఆధార్ […]
Food Poisoning: కేరళలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 100 మందికి ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేరళలో పతినంతిట్ట జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాప్టిజం వేడుకలకు హాజరైన 100 మంది వ్యక్తులు గతవారం డిసెంబర్ 29న ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఫుడ్ సప్లై చేసిన క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.