Blood type may predict risk of stroke before 60: శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో కొన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి ‘స్ట్రోక్’ ప్రమాదం ఎక్కువగా ఉందని కనుక్కున్నారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఓ మార్గాన్ని కనుక్కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్ కు చెందిన పరిశోధకులు బృదం న్యూరాలజీ జర్నల్ లో ఈ అధ్యయాన్ని ప్రచురించింది. ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూపుకు సంబంధించిన జన్యు వైవిధ్యాలను విశ్లేషించి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అంచనా వేశారు. మెదడుకు వెళ్లే రక్తాన్ని అడ్డుకోవడం…
ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది.
Pakistan defence minister’s bizarre theory about population growth: పాకిస్తాన్ మంత్రులు, అక్కడి ప్రజల అవివేకం చాలా సందర్భాల్లో చూశాం. తెలిసీతెలియని విధంగా కొత్తకొత్త ప్రతిపాదనలు, సిద్ధాంతాలు పుట్టించడంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధహస్తులు. ఏ సమస్య వచ్చినా.. కూడా ఆర్మీ, అటామిక్ ముల్క్ అని చెప్పడం తప్పితే పాకిస్తాన్ పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వానికి తత్వం బోధపడటం లేదు. ఎంతసేపు భారత్ వ్యతిరేకత, కాశ్మీర్ అంటూ మాట్లాడటం…
Putin Says Ready For Talks With Ukraine: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచదేశాలు కాంక్షిస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య మాత్రం యుద్ధం ఆగడం లేదు. రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చర్చలకు సిద్ధం అని ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఇదిలా ఉంటే రష్యా మాత్రం ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని పలుమార్లు ప్రకటించింది. అయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత కాలం రష్యాతో చర్చల ప్రసక్తే…
Mid-Air "Peeing" Incident: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు ఓ వ్యక్తి. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎయిరిండియా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇటు డీజీసీఏ, అటు ఎయిరిండియా సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎయిరిండియా 30మ…
Ayodhya's Ram Mandir Will Be Ready By Jan 1, 2024- Amit Shah's Big Announcement: అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1, 2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాాన్ని ప్రారంభించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ టార్గెట్ గా…
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని…
woman opens her eyes en route to crematorium: ఉత్తరప్రదేశ్ లో విచత్ర సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న మహిళ మళ్లీ కళ్లు తెరిచింది. అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారి కళ్లు తెరవడంతో బంధువులంతా షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్న సదరు వృద్ధరాలు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువలంతా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శ్మశాన…
Hospitals run out of beds as Covid patients increase in China: చైనాలో కోవిడ్ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అక్కడి ప్రజలు లక్షల్లో కోవిడ్ బారిన పడుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని బీజింగ్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు అన్ని నిండిపోయాయి. రోగులు హాల్ లో స్ట్రెచర్లపై పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీల్ చైర్ లో ఆక్సిజన్ తీసుకుంటున్నారు…
700 Pigs Culled In Madhya Pradesh Amid African Swine Flu Scare: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ భయాందోళనలను రేపుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. దమోహ్ జిల్లాలో ఈ వ్యాధి వెలుగులోకి రావడంతో అధికారులు పందులను చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 700 పందులను చంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా వరసగా జంతువులు చనిపోతున్నాయి. జిల్లాలోని హటా బ్లాక్ ఓ జంతువు హఠాత్తుగా…