Sonia Gandhi admitted to Delhi’s Ganga Ram Hospital for medical checkup: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో చేరారు. సోనియాగాంధీతో ఆమె కుమార్తె పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వెంట ఉన్నారు. 76ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రొటీన్ చెకప్ కోసం వచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతున్నారు. మంగళవారం నుంచి అస్వస్థతలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం యూపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో కొంత సమయం పాల్గొని మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చారు.
Read Also: Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు
గత ఏడాది కోవిడ్-19 బారిన పడినప్పటి నుంచి సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని నెలల క్రితం వైద్యం కోసం విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న యాత్రలో పరిమితంగా పాల్గొంటున్నారు సోనియాగాంధీ. కర్ణాటక మాండ్యాలో జరిగిన జోడో యాత్రలో రాహుల్, ప్రియాంకాలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు సోనియాగాంధీ. ఆ తరువాత పెద్దగా యాత్రలో పాల్గొనలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రలో మరోసారి సోనియాగాంధీ మొత్తం కుటుంబంతో కలసి పాల్గొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో పూర్తయింది. మొత్తం 5 నెలల కాలంలో 3570 కిలోమీటర్ల మేర ఈ భారత్ జోడోయాత్ర జరగనుంది. కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.