Economic Slowdown In These 3 Countries Will Impact The World In 2023 says IMF: ప్రపంచదేశాలు ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు, అమెరికా, చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఒక్క భారతదేశ ఆర్థిక పరిస్థితి మాత్రమే బాగుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు శ్రీలంక దారిలో నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలపై ఆధారపడి ఉందని.. ఈ మూడు దేశాల ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని.. అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఈ మూడు దేశాలు ఒకేసారి ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా మహమ్మారి, ద్రవ్యోల్భణం, పలు దేశాలు సెంట్రల్ బ్యాంకులు అధిక వడ్డీరేట్లు ఇలా అన్నీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
Read Also: Supreme Court: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
40 సంవత్సరాలలో మొదటిసారిగా, 2022లో చైనా వృద్ధి, ప్రపంచ వృద్ధి కన్నా తక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి వల్ల అక్కడ పలు ప్రాంతాల్లో జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్ డౌన్లను విధించింది. దీంతో తయారీ రంగంలో ప్రపంచంలో కీలకం ఉన్న చైనాపై తీవ్ర ప్రభావం పడింది. వరస లాక్ డౌన్ల వల్ల అక్కడ ఉత్పత్తి మందగించింది. ఇది కూడా చైనా ఆర్థిక తిరోగమనానికి కారణం అయింది. ప్రస్తుతం జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసింది. దీంతో కోవిడ్ మహమ్మారి వల్ల అక్కడ రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రానున్న కాలం కఠినమైనదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ న్యూఇయర్ సందర్భంగా చెప్పారు. కోవిడ్ చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందని జార్జివా అన్నారు.
ఇదిలా ఉంటే యూఎస్ఏ ఆర్థిక వ్యవస్థి అత్యంత వేగంగా ఈ పరిస్తితి నుంచి కోలుకునే అవకాశం ఉందని జార్జివా అన్నారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ వేరుగా ఉందని.. ప్రపంచంలో మూడింట ఒక వంతు మందిని ప్రభావితం చేసే ఆర్థిక మాంద్యాన్ని నివారించే అవకాశం ఉందని వెల్లడించింది. లేబర్ మార్కెట్ యూఎస్ లో చాలా బలంగా ఉందని తెలిపింది.