Pakistan: పాకిస్తాన్‌లో తీవ్ర నిరుద్యోగం.. స్టేడియంలో కానిస్టేబుల్ పరీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan unemployment: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర నిరుద్యోగం నెలకొంది. ఎంతలా అంటే సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షను క్లాస్ రూముల్లో నిర్వహిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం కానిస్టేబుల్ రాత పరీక్షను ఏకంగా ఓ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చింది. అంటే అంతలా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఇస్లామాబాద్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,667 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం ఇస్లామాబాద్ లో రాత పరీక్ష జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ పరీక్షను ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. స్టేడియంలో కూర్చోని ఆశావహులు పరీక్ష రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Also Read
Read Also: Jogi Ramesh: మరణాలకు కారణమైనవారిపై చర్యలు.. చంద్రబాబును అరెస్టు చేస్తాం..!
గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపుగా 32,000 మంది మహిళలు, పురుషులు రాత పరీక్ష కోెసం ఇస్లామాబాద్ చేరుకున్నారు. 2022లో పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రకారం దేశంలో 31 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో 51 శాతం మహిళలు కాగా.. 16 శాతం మంది పురుషులు ఉన్నారు. వీరిలో చాలా మందికి డిగ్రీలు ఉన్నాయి. ప్రస్తుతం పాక్ జనాభాలో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 60 శాత మంది ఉన్నారు. దేశంలో నిరుద్యోగిత రేటు 6.9 శాతం ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు, గ్యాస్ సప్లై చేయలేని పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఐఎఎఫ్ షరతులను ఒప్పుకోకుంటే దివాళా తీయడం ఖాయమని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో ఉన్న రాయబార కార్యాలయం స్థలాన్ని వేలానికి పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితికి అప్పులు, సీపెక్ ప్రాజెక్టు, భారీ వరదలు కారణం అయ్యాయి.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?