Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Pakistanis fill cooking gas in plastic balloons: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రానురాను దిగజారుతోంది. మరో శ్రీలంకలా మారేందుకు మరెన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భణం కారణంగా అక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో కోతలు కూడా విధించింది పాక్ సర్కార్. ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోంది.
Ukraine Will Fight Russia Until Victory says Zelensky In New Year Address: ఉక్రెయిన్ విజయం సాధించే వరకు రష్యాతో పోరాడుతూనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధంలో పాల్గొని మరణించిన ఉక్రెయిన్ సైనికులకు నివాళులు అర్పించారు. ‘‘మేము విజయం కోసం పోరాడుతాం.. పోరాడుతూనే ఉంటాం’’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు నిర్వహించిన కొన్ని గంటల్లోనే జెలన్ స్కీ తన ప్రకటనను…
3.8 Magnitude Earthquake In Haryana, Tremors Felt In Delhi: కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. హర్యానా భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. అంతకు ముందు నవంబర్ నెలలో నేపాల్ సరిహద్దుల్లో…
Rahul Gandhi said BJP is his guru: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీనే రోడ్ మ్యాప్ చూపిస్తుందని.. ఎప్పటికీ చేయకూడని వాటిని నేర్పుతోందని శనివారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీనే నా గురువు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాపై దూకుడుగా దాడి చేయాలని కోరుకుంటోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని.. నేను బీజేపీని గురువుగా భావిస్తాను.. వారు నాకు మార్గం చూపుతున్నారు, ఎప్పటికీ…
Rishabh Pant was driving Mercedes-AMG GLE 43 4MATIC Coupe, this car specifications: రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు పల్టీలు కొట్టింది. ఆ తరువాత కారుకు మంటలు అంటుకున్నాయి. అయితే సమీపంలో ఉన్న వారు రిషబ్ పంత్ ను కారు నుంచి బయటకు తీసి రక్షించారు.…
Rishabh Pant Undergoes Plastic Surgery On Forehead: కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. రిషబ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో రిషబ్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది. రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ప్రముఖులు ఆరా తీస్తున్నారు. నిన్న రాత్రి పంత్ కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.
10 nations on alert for China arrivals, demand negative Covid report: చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యను చెప్పడానికి కూడా అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రోజుకు దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరిలో ఈ కేసుల సంఖ్య ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Bairi Naresh arrested: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. గత మూడు రోజుల నుంచి ఇటీవల కోడంగల్ లో అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Bairi Naresh's controversial comments on Ayyappa Swamy: హిందూదేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పరారీలో ఉన్నాడు. కోడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అతని కోసం నాలుగు బృందాల పోలీసులు వేట కొనసాగిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు బైరి నరేష్. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ లో నరేష్ కోసం వెతుకుతున్నారు.