Russian air attack on Ukraine: కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్ జోన్లలో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న…
Suryanagari Express derails in Rajasthan: ముంబై-జోధ్పూర్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని పాలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరిని సూర్యనగరి ఎక్స్ప్రెస్ జోధ్ పూర్ డివిజన్ లోని రాజ్ కియావాస్ -బోమద్ర సెక్షన్ మద్య తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి.
Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning: న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. మహిళను ఢీకొట్టిన తర్వాత దాదాపుగా 10-12 కిలోమీటర్లు లాక్కెలింది కారు. ఈ ప్రమాదంలో మహిళ శరీరం దాదాపుగా ఛిద్రం అయింది. ఈ ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు అంజలి (20) ఢిల్లీ నివాసి. మహిళ పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లలో పార్ట్ టైమ్ వర్కర్…
License Cancellation: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం చెబుతూ మందుబాబులు లిక్కర్ సేల్స్ ను టాప్ లో నిలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టిపెట్టింది పోలీస్, రవాణా శాఖ. శనివారం హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. దాదాపుగా చాలా చోట్ల మందుబాబులు పట్టుబడ్డారు.
Record liquor sales in Telangana: న్యూ ఇయర్ తెలంగాణ ప్రభుత్వానికి కాసులు వర్షాన్ని కురిపించింది. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ నమోదు అయ్యాయి. మళ్లీ మందు దొరకదు అన్న రీతిలో మందుబాబులు తెగతాగేశారు. డిసెంబర్ 31 రోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. శనివారం ఒక్క రోజు అబ్కారీ శాఖకు రూ. 215.74 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికీ పెరిగిన రేట్ల కారణంగా భారీగానే ఆదాయాన్ని ఆర్జించింది ఎక్సైజ్ శాఖ.
Swiggy Delivered 3.5 Lakh Biryanis On New Year's Eve: ప్రపంచం మొత్తం 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఏకంగా డిసెంబర్ 31 శనివారం రోజు 3.5 లక్షల బిర్యానీలను డెలివరీ చేసింది. రాత్రి 10.25 గంటల వరకు దేశవ్యాప్తంగా 61,000 పిజ్జాలను పంపిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అన్ని రకాల బిర్యానీల్లో హైదరాబాద్ బిర్యానీనే టాప్ లో నిలిచింది. మరోసారి హైదరాబాద్ బిర్యానీకి తిరుగు లేదని నిరూపించుకుంది. ట్విట్టర్ నిర్వహించిన…
Sanjay Raut comments on Rahul Gandhi and BJP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి గతేడాది కొత్త ఊపు వచ్చిందని.. ఇది 2023లో కూడా ఇదే విధంగా కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూడవచ్చని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ ఆదివారం పేర్కొన్నారు. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రోఖ్థోక్ కాలంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు దేశంలో ద్వేషం, విభజన…
మహాత్మా గాంధీని ఎవరితో పోల్చలేమని బీజేపీ న్యూ ఇండియా విమర్శలపై మహారాష్టర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే కామెంట్స్ చేశారు. జాతి పితామహుడిని ఎవరితోనూ పోల్చలేము. బీజేపీ నవభారతం కొద్ది మంది ధనవంతులైన మిత్రుల కోసమే అని ఆరోపించారు. భారతదేశంలో చాలా మంది ఆకలితో బాధపడుతున్నారని.. మాకు కొత్త భారత దేశం అవసరం లేదని ఆయన అన్నారు. కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం వారు మోడీజీని 'నేషన్ ఆఫ్ ది నేషన్'గా మార్చాలనుకుంటే, వారిని చేయనివ్వండి. అందుకు నేను వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు.
Haryana Sports Minister Sandeep Singh booked for harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా జూనియర్ కోచ్ పోలీసులకు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ పై వేధింపులు, అక్రమంగా నిర్భందించడం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సిందీప్ సింగ్ పై శనివారం రాత్రి సెక్టార్…