India Under Scrutiny As WHO Looks At Cough Syrup Deaths: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. సంబంధిత దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన దగ్గుమందుల వల్ల మూడు దేశాల్లో 300 మందికి పైగా పిల్లలు మరణించారు. గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా దేశాల్లో పిల్లల మరణాలు నమోదు అయ్యాయి. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ కంపెనీలకు ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో డబ్ల్యూహెచ్ఓ ఎంక్వైరీ సాగనుంది.
Read Also: Asia Cup: ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా?.. ఆరోజు క్లారిటీ
ఆఫ్రికా దేశం అయిన గాంబియాలో పిల్లల చావులతో ఈ దగ్గుమందు విషాదం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఇలాగే ఉజ్బెకిస్తాన్ లో కూడా ఇలాగే జరిగింది. వీటి వెనక భారత కంపెనీలు తయారు చేసిన కాఫ్ సిరప్ ఉన్నాయని ఆయా దేశాలు ఆరోపించాయి. వీటి అమ్మకాలను నిషేధించాయి. ఈ సిరప్ వాడిన తర్వాత పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీసింది. జూలై 2022లో గాంబియాలో మొదటగా మరణాలు ప్రారంభం అయ్యాయి. పిల్లలు సాధారణం జబ్బుల కోసం తీసుకునే ఓవర్-ది-కౌంటర్ దగ్గు మందుతో మరణాలు ముడిపడి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మందుల్లో డైథైలిన్ గ్లైకాల్/ ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపదార్థం మోతాదుకు మించి ఉందని పరీక్షల్లో తేలింది.
కాంబోడియా, ఫిలిప్పీన్స్, తూర్పు తైమూర్, సెనెగల్ నాలుగు దేశాలకు ఈ విచారణను విస్తరించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. నాసిరకం మందులు నిర్మూలించేందుకు, నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రపంచ ఔషధ పరిశ్రమ పిలుపునిచ్చింది. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్, మారియన్ బయోటెక్ కంపెనీలు మరణాలనతో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు కంపెనీలను మూతపడ్డాయి. అయితే మైడెన్ ఉత్పత్తుల్లో ఎలాంటి సమస్యలు లేవని డిసెంబర్ నెలలో భారతప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియాకు చెందిన 4 ఔషధ కంపెనీలు తయారు చేసి దేశీయంగా విక్రయించే కంపెనీలపై హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.