BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
Read Also: KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్
ఇదిలా ఉంటే యూకే ఎంపీ ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మరో ఎంపీ కూడా ఇదే విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ యూకేలో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ డాక్యుమెంటరీని ‘‘ ప్రాపగండా జర్నలిజం’’ ఆరోపించింది. ప్రజలకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంటూ.. పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ గా దాని విధులను ఉల్లంఘించిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
పాత్రికేయ నిష్ఫాక్షికతను అందుకోవడంలో బీబీసీ విఫలం అయింద ఛేంజ్.ఓఆర్జీ లో బీబీసీపై స్వతంత్ర విచారణకు పిలుపునిచ్చారు. దీనిపై 2500 మంది మద్దతు ప్రకటించారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు భాగాలుగా బీబీసీ సిరీస్ రూపొందించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఇందులో మోదీ ప్రమేయం ఉందంటూ డాక్యుమెంటరీలో ఆరోపించింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ ఈ అల్లర్లపై విచారణ జరిపి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని బీబీసీ పట్టించుకోకపోవడం విశేషం.