Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
Read Also: Ramcharitmanas row: ఆ నేత నాలుక తీసుకొస్తే రూ.51,000 రివార్డు.. హిందూ మహాసభ ప్రకటన
కొన్ని ఉత్పత్తి, డెవలప్మెంట్ పనులను అమెరికాకు తరలించాలని అనుకుంటోంది. ఇటీవల టెస్లాతో ఈవీ మార్కెట్ లో ఒత్తడిని ఎదుర్కొంటోంది ఫోర్డ్. ఇది కూడా ఉద్యోగుల తొలగింపుకు ఓ కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో 2,500 ఉద్యోగాలు మరియు అడ్మినిస్ట్రేటివ్ రోల్స్‌లో 700 ఉద్యోగాలను తగ్గించాలని అనుకుంటోంది. ముఖ్యంగా జర్మనీలో పనిచేస్తున్నవారు దీనికి ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి మారడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరం అని ఫోర్డ్ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు.
యూరప్ ప్రాంతంలో ఫోర్డ్ కంపెనీకి మొత్తం 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. యూరప్ ప్రాంతంలో ఏడు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాలని ఫోర్డ్ భావిస్తోంది. జర్మనీలో బ్యాటరీ అసెంబ్లీ సైట్, టర్కీలో నికెల్ సెల్ తయారీ యూనిట్ ఫోర్డ్ ఈవీ కార్ల తయారీలో భాగంగా పనిచేస్తున్నాయి. ఆరేళ్లలో ఈవీ సెగ్మెంట్ లో 1.2 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వోక్స్ వాగన్ తో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది.