Imran Khan: పాకిస్తాన్ దివాళా అంచుకు చేరుకుంది. ఇక అధికార ప్రకటన తరువాయిగా ఉంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు తెగ కష్టపడుతోంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ అప్పు కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రపంచం అంతా చిప్ప పట్టుకుని అప్పుకోసం తిరుగుతున్నాడని
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తుందని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇక బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని తేలనెత్తాడు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని హస్తం ఉందని ఆరోపించాడు. దీన్ని యూకే ప్రధాని రిషి సునాక్ తో పాటు…
Woman Gangraped By TTE, Another Man On Moving Train: ఉత్తర్ ప్రదేశ్ లొో ఘోరం జరిగింది. కదులుతున్న రైలులో ఓ మహిళపై టీటీఈ, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడైన టీటీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అత్యాచార ఘటన జనవరి 16న సంభాల్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.
Gujarat Court Verdict on Cow Smuggling: అక్రమంగా పశువు రవాణా చేసిన వ్యక్తి కేసులో తీర్పు చెబుతూ గుజరాత్ కోర్టు కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమిపై అన్ని సమస్యలు తీరుతాయని.. తాపి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తి ఎస్వీ వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్ నుంచి ప్రభావితం కావు అని.. ఆవు మూత్రం అనేక నయం లేని రోగాలకు నివారణ అని అన్నారు. ఆవు…
Married Hindu girl abducted in Pakistan, raped: పాకిస్తాన్ లో మైానారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రాంతంలోని థార్, ఉమర్కోట్, మీర్పుర్ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్పూర్ ప్రాంతాలలో హిందూ యువతులు, బాలిక అపహరణ కొనసాగుతూనే ఉంది. హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎదిరిస్తే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.
Google Layoff: ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Siddha Ramaiah criticizes Prime Minister Narendra Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హిట్లర్, ముస్సోలినీలతో పోల్చాడు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పాడు. ప్రధానమంత్రిని రానీవ్వండి మాకు ఎలాంటి సమస్య లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని వందసార్లు చెప్పినా.. అలా జరగదని సిద్ధరామయ్య ఆదివారం స్పష్టం చేశారు.
Laid off 3 times in 4 months: చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు. నిర్ధయగా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేశాయి. కొత్త పాత…
PM Modi is one of the most powerful persons on planet: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఇటు ఇండియాలోను అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు. తాజాగా యూకే చట్టసభ సభ్యుడు కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ.. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని ఆయన అన్నారు.
BBC Documentary on Modi: భారతదేశంలో కొంతమంది సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువ అని భావిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొంతమందిని సంతోషపెట్టడానికి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని.. వారు దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలో అయినా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.