Thailand van accident: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు పిల్లలతో సహా 11 మంది సజీవదహనం అయ్యారు. లూనాన్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా సెంట్రల్ థాయ్‌లాండ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదనికి గురైందని 11 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డా
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా…
Spotify To Begin Laying Off: టెక్ లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటిస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ స్పాటిఫై కూడా తమ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలో తొలగింపులు ఉండవచ్చని ప్రకటించింది. అక్టోబర్ నెలలో స్పాటిఫై గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్ కాస్ట్ స్టూడియోల నుంచి 38 మందిని, సెప్టెంబర్ నెలలో ఎడిటోరియల్ ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంత మందిని తీసేస్తుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు ఆలయాలపై దాడులు చేస్తూ భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుగా స్లోగన్స్ రాస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలోని ఆల్బర్ట్ పార్క్ లోని ఇస్కాన్ దేవాలయం గోడపై సోమవారం ఉదయం ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు కనిపించాయి. ఇది ఈ నెలలో మూడో దాడి.
Indian Cricketers Offer Prayers At Ujjain's Mahakaleswar Temple: ఉజ్జయిన మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు ప్రత్యేకపూజలు చేశారు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది. ఇండోర్ లో మంగళవారం చివరిదైన మూడో…
Pakistan Witnesses Major Power Breakdown: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాల్లో అంధకారం అలుముకుంది. ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉదయం 7.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ ట్వీట్ చేశారు.
Bengaluru: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన టీనేజ్ యువతి బెంగళూర్ లో పట్టుబడింది. 19 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన యువతిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జీవని అనే యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
US Visa: అమెరికా డ్రీమ్స్ లో ఉన్నవారికి శుభవార్త చెప్పింది అమెరికా. వీసాల ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. తొలిసారి వీసా కోసం అప్లై చేసుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే వారి సమయాన్ని తగ్గించేందుకు భారత్ లోని అమెరికా దౌత్యకార్యాలయాలు తొలిసారిగా శనివారాల్లో కూడా ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 21న ఇలా శనివారం ఇంటర్వ్యూలు చేశాయి.
IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
Apple makes history: ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 9…