Fight In Flight: విమానాల్లో ప్రయాణికుల వికృత చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల మూత్రవిసర్జన సంఘటన తర్వాత డీజీసీఏ ప్రయాణికుల ప్రవర్తనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ప్రయాణికుడిపై సెక్షన్ 354ఏ కింద కేసు కూడా నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Read Also: USA: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే..
ఇద్దరు ప్రయాణికులు క్యాబిన్ సిబ్బందిని వేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గొడవ తర్వాత ఇద్దరు ప్రయాణికులను డీబోర్డింగ్ చేసి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన అబ్సర్ ఆలం అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. టేకాఫ్ సమయంలో, ఆలం ఒక మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ గొడవ జరిగే సమయంలో మరో ఇద్దర ప్రయాణికులు గొడవ సద్దుమణిగేలా చేశారు. ఈ సంఘటన గురించి క్యాబిన్ సిబ్బంది పీఐసీ, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. గొడవకు కారణం అయిన ప్రయాణికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అంతకుముందు న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మరో ప్రయాణికులురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇండియన్ ఏవియేషన్ రంగంలో ప్రకంపనలు పుట్టించింది. ఆ తరువాత పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీని తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇలాంటి ప్రయాణికులపై కఠినంగా ప్రవర్తించాలని ఎయిర్ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది.
#WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today
The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV
— ANI (@ANI) January 23, 2023