Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు.
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.
Teen Student Murdered By Girlfriend's Ex: ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్నాయి. బిజీ రోడ్డుపైనే ఓ అమ్మాయి మాజీ లవర్ మరో వ్యక్తిని హత్య చేశాడు. ఇది ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ముంబైలో బిజీగా ఉన్న ఓ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ను పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని చెంబూరు ప్రాంతానికి చెందిన ముఖ్తార్ షేక్ గా గుర్తించారు పోలీసులు.
China spy balloon: అమెరికా, చైనా మధ్య హై ఆల్టిట్యూడ్ బెలూన్ ఒకటి ఉద్రిక్తతలను పెంచుతోంది. చైనా నిఘా బెలూన్ గా అనుమానిస్తున్న అమెరికా దాన్ని కూల్చేందుకు సిద్ధం అయింది. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు కన్నా పైన ఈ బెలూన్ ఉన్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఈ బెలూన్ ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. నిఘా కోసమే దీన్ని చైనా ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని కూల్చేందుకు అమెరికా తన ఎఫ్-22 ఫైటర్ జెట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీన్ని…
Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
12 new moons found around Jupiter: గురు గ్రహం సౌరవ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా.. పురాణాల్లో, జోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను కనుక్కున్నారు.
Man Beaten To Death For Chatting With Girl: బెంగళూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. మృతుడిని గోవిందరాజుగా గుర్తించినట్లు, హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితులు అనిల్, లోహిత్, భరత్, కిషోర్‌గా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా అధికారులు తెలిపారు.
Byjus Layoff: ప్రముఖ ఎడ్యుకేషన్ యూనికార్న్ బైజూస్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించనున్న తెలుస్తోంది. సుమారుగా 1000-1500 మంది ఉద్యోగులను తొలగిస్తారని మీడియా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ లో 2500 మందిని ఉద్యోగులను తొలగించింది బైజూస్. ఇది దాని వర్క్ ఫోర్స్ లో 5 శాతం. అయితే మరోసారి లేఆఫ్స్ కు సిద్ధం అవుతోంది బైజూస్. బైజూ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్ అక్టోబర్‌లో 2,500 మంది సిబ్బందికి మించి ఉద్యోగులను తొలగించిన తర్వాత.