Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఈ నెలలో ఏడాదికి చేరింది. ఏడాది కాలంగా ఇరు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపోరొజ్జియా, లూహాన్స్క్, డోనాట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలు, ఇతర నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో రష్యాతో పోరాడుతోంది.
5-Door Mahindra Thar: స్వదేశీ ఆటోెమేకర్ మహీంద్రా వరసగా తన కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ విభాగంలో మహీంద్రా ఎస్యూవీ 400ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ తో సంచలనాలు నమోదు చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల 4×2(ఆర్ డబ్ల్యూ డీ) థార్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మహీంద్రా థార్ 5 డోర్ ఎస్యూవీని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న 3 డోర్ […]
Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.
Love Failure Incident: ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, వాడుకుని మోసం చేసి వేరే వారిని వివాహం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మత్తు మందును ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది.
Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు ఉన్నాయి.
Agniveer recruitment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్మీలో ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. హింసాత్మక చర్యలకు పాల్పడిని కేంద్ర వెనక్కి తీసుకోలేదు. అయితే అగ్నివీర్ పథకానికి యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున యువకులు అగ్నివీరులుగా మారడానికి అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ పథకంలో మార్పులు చేయబోతోంది సైన్యం.
Crackdown On Child Marriage: అస్సాంలో బాల్యా వివాహాలపై అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.
"Public Is The Master...": Law Minister's Latest Swipe At Supreme Court: కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ నెలకొంది. సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారం గత రెండు నెలలుగా కేంద్రం పెండింగ్ లో ఉంచింది. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తాజాగా ఈ రోజు కేంద్రం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్,
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పతనం అంచుకు చేరుకుంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు లభించడం లేదు. పిండి, వంటనూనెలు, నెయ్యి, వంట గ్యాస్, కరెంట్ ఇలా అన్నింటా కొరతే. ద్రవ్యోల్భణం ఆల్ టైం హైకి చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అయితే అక్కడి నాయకులు మాత్రం ఆర్థిక సంక్షోభానికి వింతవింత పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి పాకిస్తాన్ ను ఇస్లాం పేరుమీద అల్లా సృష్టించాడని..ప్రజలను కూడా అల్లానే ఆదుకుంటాడంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు.