Bangladesh: రాడికల్ ఇస్టామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్‌లో తీవ్ర హింసకు కారణమైంది. ఇదే సమయంలో దేశంలోని మైమన్‌సింగ్ నగరంలో ఒక హిందూ వ్యక్తిని ‘‘దైవదూషణ’’ ఆరోపణలతో అత్యంత దారుణంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి కాల్చేసి చంపారు. మృతుడిని 25 ఏళ్ల దీపు చంద్ర దాస్‌గా గుర్తించారు. ఈ ఘటన బంగ్లాలో మైనారిటీల భద్రత, ముఖ్యంగా హిందువుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఈ ఘటనపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా స్పందించి, చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, హత్యకు ముందు దీపు చంద్ర దాస్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మతోన్మాద మూక పోలీస్ స్టేషన్ నుంచి అతడిని తీసుకెళ్లి దాడి చేసి చంపిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దాస్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు ఈ వీడియో చూపిస్తోంది. ఈ దాడివలో పోలీసులు పాత్ర కూడా ఉండవచ్చనే అనుమానాలు బలపడ్డాయి.
Read Also: Rahul Gandhi: జార్జ్ సోరోస్ వ్యక్తితో రాహుల్ గాంధీ.. “రెండు శరీరాలు, ఒకే ఆత్మ” అంటూ బీజేపీ ఫైర్..
తస్లీమా ఎక్స్ పోస్టులో వీడియో షేర్ చేస్తూ.. ‘‘పు చంద్ర దాస్ మైమెన్‌సింగ్‌లోని భలుకాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతను ఒక పేద కార్మికుడు. ఒక రోజు, ఒక ముస్లిం సహోద్యోగి ఏదో చిన్న విషయంపై అతన్ని శిక్షించాలనుకున్నాడు. కాబట్టి జనసమూహం మధ్యలో, దీపు ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ప్రకటించాడు. ప్రవక్త యొక్క ఉన్మాద అనుచరులు హైనాల వలె దీపుపై పడి అతన్ని ముక్కలు ముక్కలుగా చంపడం ప్రారంభించారు. చివరికి, పోలీసులు అతన్ని రక్షించి అదుపులోకి తీసుకున్నారు – అంటే దీపు పోలీసుల రక్షణలో ఉన్నాడు.’’ అని ఆమె పోస్ట్ చేసింది.
‘‘దీపు పోలీసులకు ఏం జరిగిందో చెప్పాడు. తాను నిర్దోషినని, ప్రవక్త గురించి తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేదని, ఇదంతా తన సహోద్యోగి చేసిన కుట్ర అని చెప్పాడు. పోలీసులు సహోద్యోగిని విచారించలేదు’’ అని తస్లీమా తన పోస్ట్‌లో వ్యాఖ్యానించింది. పోలీసుల్లో కూడా చాలా మంది జిహాద్ పట్ల అభిమానంతో ఉన్నారని ఆరోపించింది. ఈ జిహాదిస్టుల ఉత్సాహం కారణంగానే వారు ఆ మతోన్మాదులకు దీపును అప్పగించారా?, జిహాదిస్టు ఆందోళనకారులు పోలీసుల్ని పక్కకు నెట్టి దీపును పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారా? దీపును కొట్టి, ఉరితీసి, దహనం చేస్తూ జిహాదిస్టులు పండగ చేసుకున్నారు’’ అని ఆమె పోస్ట్ చేసింది. దీపు తన కుటుంబలో ఏకైక పోషకుడు, అతడి సంపాదనపైనే వికాలాంగుడైన తండ్రి, తల్లి, భార్య, బిడ్డ ఆధారపడి ఉన్నారని చెప్పింది. ఈ జిహాదీల నుంచి తప్పించుకుని భారత్ రావడానికి కూడా దీపు వద్ద డబ్బులు లేవని, ఆ పేదలకు ఎవరూ లేరని, వారికి దేశం లేదని, ఇప్పుడు మతం కూడా మిగల్లేదు అని ఆమె అన్నారు.
https://twitter.com/taslimanasreen/status/2002147277389906158