Instagram Love Tragedy: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన సుభాష్‌తో ప్రవల్లిక గత రెండేళ్లుగా సహజీవనం కొనసాగిస్తుంది. ఇటీవల సుభాష్ ఒక ఇల్లు కొనుగోలు చేయగా, ఆ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మనస్తాపంతో ప్రవల్లిక ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Read Also: CM Chandrababu: జగన్ యోగా కామెంట్స్పై సీఎం చంద్రబాబు కౌంటర్..
అయితే, ప్రవల్లిక తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, పొలం అమ్మాలని ఒత్తిడి చేసి కొట్టి సుభాష్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సుభాష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక, ప్రవల్లిక మృతికి గల అసలు కారణాన్ని వెలికితీయడానికి జగ్గయ్యపేట పోలీసులు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు.