Byjus Layoff: ప్రముఖ ఎడ్యుకేషన్ యూనికార్న్ బైజూస్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించనున్న తెలుస్తోంది. సుమారుగా 1000-1500 మంది ఉద్యోగులను తొలగిస్తారని మీడియా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ లో 2500 మందిని ఉద్యోగులను తొలగించింది బైజూస్. ఇది దాని వర్క్ ఫోర్స్ లో 5 శాతం. అయితే మరోసారి లేఆఫ్స్ కు సిద్ధం అవుతోంది బైజూస్. బైజూ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్ అక్టోబర్‌లో 2,500 మంది సిబ్బందికి మించి ఉద్యోగులను తొలగించిన తర్వాత.. ఇకపై తొలగింపులు ఉండవని హామీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది మరోసారి ఉద్యోగాల తొలగింపుకు సిద్ధం అవుతున్నారు.
Read Also: US Layoffs: రెండేళ్ల గరిష్టానికి అమెరికాలో ఉద్యోగుల తొలగింపు..
లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ వంటి కొన్ని విభాగాల్లోని విధులను అవుట్ సోర్స్ చేయడానికి కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో విడతలో ఇంజనీరింగ్, డిజైన్, ప్రొడక్షన్ విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 1 కోటి మరియు అంతకంటే ఎక్కువ వార్షిక వేతనాలు తీసుకుంటున్న వారితో సహా ఉన్నతాధికారులను కూడా తొలగించినట్లు సమాచారం.
బైజూస్ తో పాటు ఇతర ఎడ్ టెక్ సంస్థలు వేదాంతు, అనాకడెమీ కూడా తమ ఉద్యోగులను తొలగించాయి. వేదాంతు ఇటీవల 385 మంది ఉద్యోగులను అంటే దాదాపుగా 11.6 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తంగా రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిపి 1,100 మందిని తొలగించింది. గతేడాది నవంబర్ లో అనాకాడెమీ 350 మంది ఉద్యోగులను తొలగించింది.