Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
Read Also: IT Layoffs: ఐఐటీలో చదివిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తప్పలేదు.. ఉద్యోగం ఉంటే చెప్పాలని పోస్ట్..
తాజాగా యాపిల్ కంపెనీల కూడా భారత మార్కెట్ తమకు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తోంది. భారత మార్కెట్ పై సానుకూల దృక్పథంతో ఉన్నామని సంస్థ సీఈఓ టీమ్ కుక్ వెల్లడించారు. పెట్టుబడులు, రిటైల్, ఆన్ లైన్ మార్గాల్లో భారత్ పై దృష్టి సారించామని.. భారత మార్కెట్ ను ‘‘ఉత్తేజకరమైన మార్కెట్’’గా అభివర్ణించారు. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్ గురువారం ప్రకటించింది. 117.2 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఇది 2021 డిసెంబర్ త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే 5 శాతం తక్కువ. ఇండియాతో పాటు స్పెయిన్, కెనడా, ఇండోనేషియ, మెక్సికో, టర్కీ, వియత్నాం, బ్రెజిల్ దేశాల్లో రికార్డు స్థాయి రెవెన్యూను నమోదు చేసింది.
భారత్ లో రికార్డు స్థాయిలోొ రెవెన్యూ నమోదు అయినట్లు యాపిల్ చీఫ్ టిమ్ కుక్ వెల్లడించారు. వార్షిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధి నమోదు అయినట్లు వెల్లడించారు. 2020లో ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. వచ్చే కొద్ది రోజుల్లో రిటైల్ ప్రారంభిస్తామని.. భారతీయులకు అందుబాటు ధరల్లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల ద్వారా 68.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చినట్లు యాపిల్ వెల్లడించింది.