CM Chandrababu: అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సందర్శించారు. ఈ స్కూల్ నుంచే ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ తర్వాత రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండొద్దు.. స్వచ్ఛంధ్రాలో అనకాపల్లి 13వ స్థానంలో ఉంది.. ర్యాంకింగ్ మెరుగుపడాలని సూచించారు. అలాగే, నాతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీల పని తనాన్ని పరిశీలిస్తున్నాను.. సమర్ధవంతంగా ఎలా పని చేయించాలో నాకు తెలుసు.. ఎవరినీ వదిలిపెట్టను అన్నారు. 90 ఎకరాల్లో తొలి ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్ అనకాపల్లిలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
Read Also: Ishan Kishan In World Cup: ప్రపంచ కప్‌లో చోటు కోసం రెండేళ్లు ఎదురు చూసిన ఇషాన్ కిషన్..
ఇక, అరకు కాఫీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది.. ఆనంద మహేంద్ర ట్విట్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఎగుమతి చేసేలా వెళ్ళాలి.. రెండు నెలల్లో అనకాపల్లి జిల్లాకు పోలవరం నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్వోదయ కింద కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాను.. ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోంది.. రుషికొండను గుండు కొట్టి ఖర్చుపెట్టిన రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయారు? అని ప్రశ్నించారు. జగన్ యోగా కామెంట్స్ పై కూడా తీవ్రంగా మండిపడ్డారు. విశాఖ ఏజెన్సీని వైసీపీ గంజాయి వనంగా మారిస్తే.. కూటమి ప్రభుత్వం కాఫీ వనంగా తీర్చిదిద్దింది అని చంద్రబాబు అన్నారు.