IndiGo: బీహార్ వెళ్లాల్సిన వ్యక్తిని రాజస్థాన్‌లో దించిన విమానం.. ఘటనపై డీజీసీఏ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.
ఇదిలా ఉంటే మరో సంఘటన జరిగింది. బీహార్ లోని పాట్నాకు వెళ్లాల్సిన వ్యక్తిని, రాజస్థాన్ ఉదయ్ పూర్ లో దించింది ఇండిగో విమానం. ఎయిర్ పోర్టులో పలు దశల్లో ప్రయాణికుడి బోర్డింగ్ పాస్ చెక్ చేస్తుంటారు.. అయినా కూడా వేరే విమానంలో గమ్యస్థానానికి 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ప్రాంతంలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. తరువాతి రోజు సదరు ప్రయాణికుడిని గమ్యస్థానానికి పంపారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Read Also: Free Cancer Screening: మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..
అఫ్సర్ హుస్సేన్ అనే ప్రయాణికుడు ఇండిగో ఫ్లైట్ 6ఈ-214 ద్వారా పాట్నాకు టిక్కెట్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే షెడ్యూల్ చేసిన టైమ్ కు విమానం ఎక్కడానికి జనవరి 30న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అతను పొరబాటున ఇండిగోకు చెందిన మరో విమానం 6ఈ-319 విమానం ఎక్కాడు. ఇది ఢిల్లీ నుంచి రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ వెళ్తోంది. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత అఫ్సర్ కు అసలు విషయం అర్థం అయింది. ఈ ఘటనపై అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇండిగో అతడిని అదే రోజు ఢిల్లీకి, ఈ తరువాత జనవరి 31న పాట్నాకు తీసుకెళ్లింది.
ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని.. డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రయాణీకుల బోర్డింగ్ పాస్‌ను ఎందుకు పూర్తిగా స్కాన్ చేయలేదని, నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాస్‌లను బోర్డింగ్‌కు ముందు రెండు పాయింట్ల వద్ద తనిఖీ చేసినప్పటీకీ.. అతను తప్పుగా ఎలా ఎక్కాడు అనే విషయాలను డీజీసీఏ విచారిస్తోంది. గత 20 రోజుల్లో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. దీనిపై ఇండిగో స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు జనవరి 13న, ఇండోర్ వెళ్లే విమానానికి ఎయిర్‌లైన్స్ టిక్కెట్, బోర్డింగ్ పాస్ కలిగి ఉన్న ఒక ప్రయాణికుడు తప్పు విమానంలో ఎక్కి నాగ్‌పూర్ విమానాశ్రయంలో దించింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!