Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
Imran Khan: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్)ను వాడతారా..?
Google India Lay Off: గతేడాది చివర్లో ప్రారంభం అయిన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా గూగుల్ ఇండియా భారతదేశంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం అర్థరాత్రి ఉద్యోగులకు మెయిల్ ద్వారా తొలగింపు గురించి సమాచారాన్ని అందించారు. గూగుల్ ఇంటియా కంట్రీ…
George Soros On PM Modi: భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ వ్యవహారంలో బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. అదానీ స్టాక్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ‘ భారత్ తో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం’ వస్తుందని..ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
Tax Survey on BBC:భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ టాక్స్ సర్వే చేపడుతోంది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. ఐటీ పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ బీబీసీ కార్యాలయాల్లో రైడ్స్ చేస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ధిక్కరించిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ టాక్స్ సర్వేపై ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు.
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.
Delhi High Court: భార్య నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్న భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతను అప్లై చేసుకున్న విడాకులను కోర్టు సమర్థించింది. ప్రతీ వ్యక్తి కూడా గౌరవంగా జీవించడానికి అర్హులని..నిరంతర వేధింపులతో ఎవరూ జీవించకూడదని పేర్కొంది. భార్యతో విడిపోవడాన్ని సమర్థించింది. భార్య వేధింపులతో భర్త విడాకులు కోరాడు. ఈ కేసులో 2022 జూలైలో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. తాజాగా ఈ కేసును విచారించిన…
BBC Documentary On Modi: భారత వ్యతిరేఖ శక్తులు సుప్రీంకోర్టును ఓ సాధనంగా వినియోగించుకుంటున్నాయని తన అనుబంధ పత్రిక పాంచజన్యలో పేర్కొంది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసింది. భారత్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న బీబీసీని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్ఎస్ఎస్ తాజాగా తన పత్రికలో వ్యాఖ్యలు చేసింది.
2023 Tata Harrier: దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా తన హారియర్ ను మరింత గ్రాండ్ గా తీసుకురాబోతోంది. 2023 టాటా హారియర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అధునాతన అడాస్( అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కొత్త హారియర్ లో టాటా తీసుకురాబోతోంది. న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లతో రాబోతోంది. పాత హారియర్ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి రూ. 22.60 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండగా.. కొత్త హారియర్ ధర…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. "భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.