Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది.
Bengaluru world’s second-most traffic congested city: ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూర్ చోటు సంపాదించుకుంది. లండన్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా బెంగళూర్ నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యధిక రద్దీ ఉన్న నగరాలకు ర్యాంకింగ్స్ కేటాయించింది. భారత్ నుంచి బెంగళూర్ రెండో స్థానంలో నిలవగా.. పూణే 6వ స్థానంలో, న్యూఢిల్లీ 34వ స్థానంలో, ముంబై 47వ స్థానంలో ఉన్నాయి
Nikki Yadav Case: శ్రద్ధా వాకర్ హత్య తర్వాత ఢిల్లీలో చోటు చేసుకున్న నిక్కీ యాదవ్ హత్య సంచలనంగా మారింది. సహజీవనంలో ఉన్న 23 ఏళ్ల నిక్కీ యాదవ్ ను, అతని ప్రియుడు సాహిల్ గెహ్లాట్(24) ఛార్జింగ్ కేబుల్ తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచి పెట్టి మరో యువతిని వివాహం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహజీవనంలో ఉన్నారని అనుకున్నప్పటికీ.. నిక్కీ యాదవ్- సాహిల్ గెహ్లాట్ కు అంతకుముందే…
GST Council Meeting: జీఎస్టీ పరిహారం బాకాయిలు రూ.16,982 కోట్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి భావించినట్లు తెలిపారు. జూన్ నెల వరకు రాష్ట్రాలకు రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు.
Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.
Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓపికపట్టండి.. తదుపరి బీఎంసీ…
Woman writes Class 10 exam hours after giving birth to son: బీహార్ లో ఓ మహిళ చదువుకోవాలనుకుంటున్న వారికి స్పూర్తిగా నిలుస్తోంది. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ ఘటన బుధవారం రోజు బీహార్ లోని బంకాలో చోటు చేసుకుంది. కొడుకు జన్మించిన తర్వాత మూడు గంటల్లోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాసింది. పరీక్ష రాయాలనే ఆమె సంకల్పాన్ని ప్రసవవేదన కూడా కదిలించలేకపోయింది. పురిటి నొప్పుల ముందు ఎగ్జామ్ రాయాలన్న ఆమె స్థైర్యాన్ని…
Nitish kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిందని ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ శనివారం అన్నరు. గోవాలోని మిరామార్ బీచ్ లో పతంజలి యోగ్ సమితి పేరుతో మూడురోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత క్యాన్సర్ చాలా పెరిగిందని.. ప్రజలు కంటి చూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారని అన్నారు.
NIA Raids In Popular Front Of India Case: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) టార్గెట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా కోటాలో మూడు ప్రాంతాల్లో సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుండి, జైపూర్ ప్రాంతాల్లో అనుమానితులు నివాస, వ్యాపార స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.