Taapsee pannu : ప్రతి డైరెక్టర్ అదే మాట.. నా మీద నాకే అసహ్యం వేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో తాప్సీ ఒకరు. 2010లో ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, ఆ తర్వాత బాలీవుడ్ లో ‘పింక్’, ‘తప్పాడ్’, ‘బద్లా’ వంటి సినిమాలతో తనలోని నటిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, పాత్ర కోసం ఎంతటి సవాళ్లనైనా స్వీకరించే పట్టుదల ఆమెను పవర్‌ఫుల్ లేడీగా నిలబెట్టాయి. నటనలోనే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది తాప్సీ. అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికి బాడీ షేమింగ్ అనేది కామన్. అలాగే తాప్సీ కూడా కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఏదురుకుందట.
Also Read : Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన ప్రియాంక.. ఒక్కసారిగా హీటెక్కిన సోషల్ మీడియా!
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ , సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ మరియు వివక్ష గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనకున్న సహజమైన రింగుల జుట్టు (Curly Hair) వల్ల చాలా మంది దర్శకులు తనను గ్లామర్ పాత్రలకు పనికిరావని తిరస్కరించేవారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల వారిని చూసి, నా జుట్టు ఎందుకు ఇలా ఉంది అని తనని తానే అసహ్యించుకునే స్థితికి చేరుకున్నానని ఆమె నిజాయితీగా చెప్పుకొచ్చింది.
దర్శకులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద హెయిర్ బ్రాండ్లు కూడా తన రింగుల జుట్టు తో యాడ్స్ చేయడానికి నిరాకరించేవని, షూటింగ్ సమయంలో జుట్టును స్ట్రెయిట్ చేయాలని కండిషన్ పెట్టేవారని తాప్సీ తెలిపారు. గ్లామర్ అంటే కేవలం ఒకే రకమైన లుక్ అని నమ్మే ఈ ధోరణి తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. అయితే, కాలక్రమేణా తన సహజ రూపాన్ని తాను ప్రేమించడం మొదలుపెట్టానని, ఇప్పుడు అదే రింగుల జుట్టు తన ఐడెంటిటీ గా మారిందని ఆమె గర్వంగా చెప్పారు. ఇతర మహిళలు కూడా ఎవరో మెచ్చుకోవాలని కాకుండా, తమ సహజ సిద్ధమైన అందాన్ని ప్రేమించాలని తాప్సీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!