Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే. ఏవియేషన్ హిస్టరీలోనే ఇది భారీ డీల్.
Naukri survey On IT Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్య భయాలు ఐటీ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, డెల్, విప్రో వంటివి ఇప్పటివకే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కువ ప్రభావితం అయింది మాత్రం అమెరికాలో పనిచేస్తున్నవారే. అయితే రానున్న కాలంలో ఇండియాలో కూడా ఉద్యోగాల తొలగింపు ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణుల్లో ఆందోళన నెలకొంది.
Nikki Haley: వచ్చే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ బరిలో నిలవనున్నారు. చెప్పకనే చెబుతూ.. ఆమె అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించినట్లయింది. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్ర బూడిద కుప్పగా ముగుస్తుందంటూ విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ లాగే చైనా పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
Suicide Attempt: ఇటీవల కాలంలో యువతలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న ఒత్తడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుని ప్రాణాలు వదులుతున్నారు. ఇలాగే ముంబైకి చెందిన 25 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పోలీసులు వచ్చి కాపాడారు. ఇదంతా సదరు యువకుడికి తెలయకుండానే జరిగింది.
Turkey Earthquake: టర్కీ భూకంపంలో ఇప్పటికే మరణాల సంఖ్య 42,000లను దాటింది. గత వారం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. వెయ్యికి పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీతో పాటు సిరియా దేశం తీవ్రంగా దెబ్బతింది. గత దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా టర్కీలోని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా.. ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో కూడా అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా ఎలాంటి నీరు, ఆహారం లేకుండా కొంత మంది మృత్యుంజయులుగా…
Delhi Haj Committee election: ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హజ్ కమిటీపై ఆప్ అధికారాన్ని కోల్పోయింది. హజ్ కమిటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన కౌసర్ జహాన్ విజయం సాధించారు. ఢిల్లీ చరిత్రలోనే ఓ మహిళ చైర్మన్ పదవిని చేపట్టడం ఇది రెండోసారి మాత్రమే. గత కొంత కాలంలో ఢిల్లీ హజ్ కమిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేదని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ కు గట్టి…
Thyroid Diseases: ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలా వస్తున్న ఇలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి.
Lightning strikes Christ the Redeemer statue: క్రీస్తు విగ్రహం మెరుపు పడిన దృశ్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బ్రెజిల్ లోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాంపై పిడుగుపడింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్లు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న మెరుపుదాడిని చిత్రీకరించారు. మెరుపు చిత్రాన్ని మస్సిమో అనే నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ ఫోటోను 18…
Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణాల సంఖ్య గంటగంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి టర్కీ దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు వెలికితీస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాలో కలిపి 28,000 పైగా మరణాలు నమోదు అయ్యాయి. టర్కీలో 24,617 మంది, సిరియాలో 3,574 మంది మరణించారని అధికారులు మరియు వైద్యులు తెలిపారు. మొత్తంగా 28,191 మంది మరణించారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.