Lithium: అత్యంత విలువైన లిథియం ఖనిజ నిల్వలు జమ్మూకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా 60 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో భారత్ దిశమారబోతోంది. అయితే దీన్ని కనుగొనేందుకు దాదాపుగా 26 ఏళ్ల శ్రమ దాగుంది. 26 ఏళ్ల క్రితమే జీఎస్ఐ జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ ప్రాంతంలో లిథియం ఉనికి గురించి ఒక వివరణాత్మక నివేదిక అందించింది. అయితే అప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.
India vs Australia Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలిటెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్ 132 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఆసీస్ టీమ్ పై దారుణంగా విమర్శలు చేస్తోంది. ఈ ఓటమిని ‘అవమానకరమైన ఓటమి’గా అభివర్ణిస్తోంది. రెండో టెస్టుకు మార్పులతో బరిలోకి దిగాలని సూచించింది. స్పిన్ తో ఆసీస్ కు చుక్కలు చూపించిన అశ్విన్, రవీంద్ర జడేజాలపై ప్రశంసలు కురపిస్తోంది అక్కడి మీడియా.
Turkey Earthquake: భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచదేశాలు టర్కీ, సిరియా దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని తీవ్రంగా దెబ్బతీసింది. 6000కు పైగా భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 25 వేలకు చేరుకుంది. మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై-ఢిల్లీ ఎక్స్ప్రెస్ వేను ప్రాజెక్టును మొదలుపెట్టింది. 1,386 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ఆర్థిక రాజధాని ముంబైని దేశరాజధాని ఢిల్లీని కలుపుతుంది. ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింతగా తగ్గతుంది. 180 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ఇప్పుడున్న 24 గంటల ప్రయాణకాలం 12 గంటలకు తగ్గిపోతుంది.…
Turkey Earthquake: భూకంపంలో టర్కీ విలవిల్లాడుతోంది. భారీ భూకంపం వల్ల గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చూస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీని కోలుకోలేని దెబ్బతీశాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు కదిలిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టర్కీతో పాటు సిరియాను భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 28 వేల మందికి పైగా ప్రజలు…
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరసగా గంటల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి 28,000 మందికి పైగా మరణించారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు తొలగించినా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.
Canada: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. అమెరికా ఫైటర్ జెట్లు దీన్ని కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో ఘటన. కెనడా భద్రతాదళాలు దీనికి సంబంధించిన…
Sperm Donation: చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా వ్యాప్తం వీర్యం కోసం పలు స్పెర్మ్ బ్యాంకులు దానం చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను డొనేట్ చేయాలని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. బీజింగ్, షాంఘైతో పాటు ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ విద్యార్థులు ఇది ఓ ఆదాయ మార్గంగా , చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి మార్గంగా దోహదం చేస్తుందని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి గుడిలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అయితే ఆ సమయంలో బాలిక, తల్లి నుంచి విడిపోయింది. బాలిక ఇంటికి వెళ్లి ఉంటుందని తల్లి భావించింది.