S Jaishankar: విదేశీ బిలియనీర్ జార్జ్ సోరోస్ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ఆయన వ్యాఖ్యలపై మండిపడుతోంది. నిన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జ్ సోరోస్ పై విమర్శలు గుప్పించారు. ముసలివాడు, ధనవంతుడు, అతని అభిప్రాయాలు ప్రమాదకరమైనవి అంటూ మూడు ముక్కల్లో జార్జ్ సోరోస్ ను అభివర్ణించాడు. మొత్తం ప్రపంచం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని భావించే వ్యక్తి అని జైశంకర్ అన్నారు.
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని.. మేము పోరాడుతూనే ఉంటామని.. ఆశల్ని కోల్పోమని..…
పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
No Conflict In India Buying Russian Crude Oil Says US Official: భారతదేశం అమెరికా భాగస్వామిగా ఉంటూ రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంలో మాకేం విభేధాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్య అధికారిగా ఉన్న ఇంధన వనరుల సహాయ కార్యదర్శి జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. భారత్ రష్యాతో సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో భారత్, రష్యాతో గట్టి బేరం కుదుర్చుకుందని దీంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇంధన భద్రతలో అమెరికా,…
JKGF Banned In India: భారత దేశానికి, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడుతున్న ఉగ్రసంస్థలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలతో ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్)పై శుక్రవారం ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)ను కూడా నిషేధించింది. ఈ రెండింటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఈ నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాటు పంజాబ్ కు చెందిన హర్విందర్…
Parasites Eat Eye: కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్ర పోతున్నారా..? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. చిన్న పొరపాటు కారణంగా కన్నును కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక వ్యక్తి కాంటాక్ట్ లెన్స్ ను ధరించే నిద్రపోయాడు. అయితే అరుదైన పరాన్నజీవి అతని కంటి మాంసాన్ని తినేసింది. ఫలితంగా అతను కంటి చూపును కోల్పోయాడు.
Shiv Sena: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘ విల్లు బాణం’ సీఎ ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతాయిని భారత ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. గతేడాది శివసేనలో ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్- శివసేన- ఎన్సీపీల కూటమి మహావికాస్ అఘాడీ…
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు.
Lord Hanuman on Aircraft: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించిన ప్రోటోటైప్ ఎయిర్క్రాఫ్ట్ పై హనుమంతుడి బొమ్మ వివాదాస్పదం అయింది. అయితే దీనిని ఆ తరువాత తొలగించారు. ఇదిలా ఉంటే బెంగళూర్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో చివరి రోజు విమానంపై హనుమాన్ స్టిక్కర్ ప్రత్యక్షం అయింది. దీనిపై హెచ్ఏఎల్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఇటీవల ఏరో షో తొలిరోజు విమానాల ప్రదర్శనలో భాగంగా హెఏఎల్ కొత్తగా రూపొందించిన సూపర్ సోనిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ HLFT-42 తోకపై హనుమాన్ బొమ్మ ఉంది.…
Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.