Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
Read Also: MLA Shankar Naik : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన కౌన్సిలర్ల సహాయంతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఎల్జీ నియమించిన సభ్యులు ఎన్నికల్లో ఓటేయవద్దని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నించడంతో బీజేపీ, ఆప్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కన్నా ఆప్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో విజయం సాధించగా.. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఢిల్లీ నగర పీఠం నుంచి బీజేపీని గద్దె దించింది.
మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ముందుగా మేయర్ ఎన్నిక జరగాలని.. ఆ తరువాత జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు మేయర్ అధ్యక్షత వహిస్తారని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని.. ఢిల్లీకి రెండున్నర నెలల తర్వాత మేయర్ పదవి దక్కేనుంది. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ కలిసి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇప్పుడు రుజువైంది’’ అని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.