Karachi Terrorists attack: పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Read Also: USA: భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మాకేం ఇబ్బంది లేదు..
ప్రస్తుతం వస్తున్న నివేదిక ప్రకారం.. ఉగ్రవాదులు ఆటోమెటిక్ మిషన్ గన్స్, హ్యాండ్ గ్రెనేడ్లతో దాడులు చేస్తున్నారు. ఈ ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీషా, పోలీస్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపాలని డీఐజీలను ఆదేశించారు. అదనపు ఐజీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడిలో ఒక రెస్క్యూ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై సింధ్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరి ఆందోళన వ్యక్తం చేశారు. ఐజీ గులాం నబీ మెమన్ నుంచి నివేదిక కోరారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.