Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు. ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాడరు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి’ అనే అంశంపై చైనా అధికారిక మీడియాలో అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మరిన్ని ప్రయత్నాలు చేయాలని జిన్ పింగ్ తెలిపారు.
50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చైనాలో అత్యల్ప వృద్ధి రేటు నమోదు అయింది. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా మూడు శాతం వృద్ధిరేటుకు మాత్రమే పరిమితం అయింది. 2023లో ఆర్థిక పరిస్థితి సంక్షిష్టంగా ఉందని.. దానిని పునరుద్దరించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని జిన్ పింగ్ పేర్కొన్నాడు. ప్రధాన సమస్యలు, ప్రజల అంచనాలను మెరుగుపరచడం, అభివృద్ధిపై విశ్వాసం పెంచడం ప్రారంభించాలని సూచించాడు.
Read Also: Lord Hanuman on Aircraft: విమానంపై మళ్లీ ప్రత్యక్షం అయిన హనుమాన్ చిత్రం..
తయారీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా చైనా ఉంది. అయితే కోవిడ్ సంక్షోభం, జీరో కోవిడ్ విధానం, బలవంతపు లాక్ డౌన్లు, టెక్ పరిశ్రమలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అణిచివేత కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం దెబ్బతింది. చాలా వరకు పెట్టుబడులు ఇండియా, ఇతర దేశాలకు తరలివెళ్లాయి. ప్రస్తుతం చైనా జీడీపీ 17.94 ట్రిలియన్లకు చేరుకుంది. 1974లో చివరి సారిగా చైనా జీడీపీ 2.3 శాతానికి పరిపోయిండి, ఇదే అతితక్కువ వృద్ధిరేటు. ఇక ఆర్థిక మందగమనం కారణంగా ఆ దేశంలో నిరసనలు పెరిగాయి.
దీనికి తోడు చైనాలో వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు జనాభా రేటు క్షీణిస్తోంది. గతేడాది చివరి నాటికి 60 ఏళ్లు నిండిన వృద్ధుల సంఖ్య 26.7 కోట్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో 18.9 శాతం. 2025 నాటికి 30 కోట్లకు , 2035 నాటికి అక్కడ వృద్ధుల జనాబా 40 కోట్లకు చేరుకుంటుందని అంచనా.