No Conflict In India Buying Russian Crude Oil Says US Official: భారతదేశం అమెరికా భాగస్వామిగా ఉంటూ రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంలో మాకేం విభేధాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్య అధికారిగా ఉన్న ఇంధన వనరుల సహాయ కార్యదర్శి జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. భారత్ రష్యాతో సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో భారత్, రష్యాతో గట్టి బేరం కుదుర్చుకుందని దీంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇంధన భద్రతలో అమెరికా, భారత్ తో సౌకర్యవంతంగా ఉందని వెల్లడించారు. భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా చేసిన స్పష్టమైన తొలి ప్రకటన ఇదే. అమెరికా ప్రపంచ భాగస్వాముల్లో భారత్ ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
రష్యా ముడి చమురు ధరపై భారతీయ కంపెనీలు విజయవంతంగా చర్చలు జరుపుతున్నాయని.. దీని వల్ల భారత రిఫైనరీలు సరసమైన ధరకు ఆయిల్ ను గ్లోబల్ మార్కెట్ లో ఉంచడానికి వీలు కల్పిస్తున్నాయని జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. ప్యాట్ ఫిబ్రవరి 16-17 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, పౌర అణుశక్తి రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని విస్తరించడానికి చర్చలు జరుపుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత జీ 7 దేశాలు( యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా) రష్యా ఆయిల్ ధర పరిమితిని విధించాయి. బ్యారెల్ కు 60 డాలర్ల కన్నా ఎక్కువ చెల్లించకుండా ప్రైస్ క్యాప్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి కేవలం 15 డాలర్లకే బ్యారెల్ కొనుగోలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నట్లు ప్యాట్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా వద్ద నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే దీనిపై యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా భారత్ పై ఒత్తడి తీసుకువచ్చింది. అయితే పలు సందర్భాల్లో వెస్ట్రన్ మీడియా చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు.