Arunachal Pradesh Earthquake: ప్రపంచంలో ఇటీవల కాలంలో వరసగా భూకంపాలు నమోదు అవుతున్నాయి. టర్కీ భూకంప విషాదం ముగియకముందే పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ఆదివారం భూకంపం వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అస్సాం, భూటాన్ దేశం తూర్పు ప్రాంతాల వరకు ప్రకంపనలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12.12 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు నేషనల్…
Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ ఫలించదని అన్నారు.
Bihar jail inmate swallows mobile phone: బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మింగేశారు. జైలులో పోలీస్ అధికారులు తనిఖీ చేస్తుండటంతో, తన దగ్గర ఉన్న ఫోన్ దొరుకుతుందనే భయంతో మింగేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొంత సేపటికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఖైదీని ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Virat Kohli Breaks Sachin Tendulkar's All-Time Record: స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒక్కొక్కటిగా ప్రపంచ రికార్డులను తుడిచిపెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రికెట్ లోనే అత్యధిక సెంచరీల రికార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. తాజాగా మరో రికార్డును విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచారు విరాట్ కోహ్లీ. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజాగా సచిన్ రికార్డును బద్దలు…
NASA: సౌరకుటుంబంలో అనేక గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. చాలా వరకు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం వీటి నుంచి బయటపడి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. అయితే తాజాగా కనుగొన్న గ్రహశకలం మాత్రం విచిత్రమైన ఆకారంలో ఉంది. ఓ పెద్ద భవనం మాదిరిగా ఉంది. దీని పొడవు 1600 అడుగులు కాగా.. వెడల్పు 500 అడుగులు ఉన్నట్లు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పోలుస్తున్నారు శాస్త్రవేత్తలు.
Sanjay Raut: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కోల్పోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని.. వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని.. ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను వెల్లడించారని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు…
Physical assault on minor girl: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడోచోట అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కువగా తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా భూతవైద్యం పేరుతో ఓ మాంత్రికుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
Turkey Earthquake: టర్కీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియాల్లో వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు వారాల క్రితం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1000 పైగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీంతో టర్కీ, సిరియా దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.
Odisha: తనకు అప్పటికే 11 మంది పిల్లలు. చాలీచాలని బతుకులు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. దీంతో ఆ మహిళ భర్తకు చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టబీ ఆపరేషన్) చేయించుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆధునిక యుగంలో ఉన్న కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల మత్తు వీడటం లేదు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో జానకి దేహూరి తన పిల్లలతో కలిసి దిమిరియా…