Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాను విమానం నుంచి దింపేసిన తర్వాత అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు బయలుదేరిన పవన్ ఖేరాను విమానం నుంచి దింపేశారు అధికారులు. పార్టీ నేతలతో కలిసి విమానం ఎక్కిన కొద్ది సేపటికే ఆయనను అధికారులు అడ్డగించారు. రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
PM Narendra Modi: పునరుత్పాదక ఇంధనం బంగారం గనుల కన్నా తక్కువేం కాదని.. ఇందులో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ గ్రోత్‌పై యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..గ్రీన్ ఎనర్జీలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నానని అన్నారు. భారతదేశం సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుందని, నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రైవేట్ రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని తెలిపారు.
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని మార్కెట్ కు తీసుకువస్తారని అన్నారు.
Karnataka IAS Vs IPS Fight: కర్ణాటకలో ఇద్దర మహిళా సివిల్ సర్వెంట్ల ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఫేస్ బుక్ వేదికగా ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి ఫోటోలను షేర్ చేసి, పలు విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు ప్రభుత్వం అంతా ఈ విషయంపై ఆగ్రహంతో ఉంది. సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేసుకోవద్దని ఇద్దరిని హెచ్చరించారు సీఎస్ వందితా శర్మ.
Maternal Mortality: ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గినప్పటికీ.. గర్భం, ప్రసవ సమస్యల కారణంగా ప్రపంచంలో ప్రతీ రెండు నిమిషాకలు ఓ మహిళ మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. 2000 నుంచి 2015 మధ్య మరణాల రేటు గణనీయంగా పడిపోయినప్పటికీ.. 2016-2020 మధ్య అలాగే స్థిరంగా ఉన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో పెరిగినట్లు యూఎన్ తెలిపింది.
Swara Bhasker Marriage: స్వరాభాస్కర్ పెళ్లిపై ఇంకా విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ఇటు హిందూ నేతలు, అటు ముస్లిం గురువులు ఆమె వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అయోధ్య మహంత్ రాజు దాస్, స్వరాభాస్కర్ ఓ ముస్లింను వివాహం చేసుకోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరా భాస్కర్ సాధికారిత కలిగిన మహిళ అయితే ముందు ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అన్నారు.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
IPS D Roopa Moudgil Facebook latest post: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల రచ్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. రోహిణి సింధూరి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసిన రూపా, ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా ఆమె మెంటల్ కండీషన్…
Earthquake Hits Eastern Tajikistan: టర్కీ భూకంపం తరువాత ప్రపంచంలో వరసగా పలు దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న ఇండియా, నేపాల్ లో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తజకిస్తాన్ లో భారీ భూకంపం వచ్చింది.