PM Narendra Modi: పునరుత్పాదక ఇంధనం బంగారం గనుల కన్నా తక్కువేం కాదని.. ఇందులో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ గ్రోత్‌పై యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..గ్రీన్ ఎనర్జీలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నానని అన్నారు. భారతదేశం సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుందని, నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రైవేట్ రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని తెలిపారు.
Read Also: Taraka Ratna: నా జీవితంలో నువ్వే బెస్ట్… తారకరత్న గురించి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్
ప్రస్తుత బడ్జెట్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని అన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిండంతో పాటు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగుతామని ప్రధాని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీకి కేటాయింపులు మన భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు పునాది రాయి అని అన్నారు. భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అత్యంత వేగంగా పురోగమిస్తోందని ప్రధాని చెప్పారు.
షెడ్యూల్ కంటే ఐదు నెలల ముందే భారత్ 10 శాతం ఇథనాల్ కలపడం లక్ష్యాన్ని సాధించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే తొమ్మిదేళ్ల ముందుగానే 40 శాతం నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడం గురించి మాట్లాడారు. భారత్ బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని 125 గిగావాట్లకు పెంచాలని ఆయన పేర్కొన్నారు.2030 నాటికి 500 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని భారత్ కలిగి ఉండాని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇథనాల్ మిశ్రమం, పీఎ కుసుమ్ పథకం, సోలార్ తయారీ ప్రోత్సహించడం, రూఫ్ టాప్ సోలార్ స్కీమ్, ఈవీ బ్యాటరీ వంటి నిర్ణయాలను తీసుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.