Russi-Ukraine War: ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యాను భారత్, చైనా అడ్డుకుని ఉండవచ్చని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ అణు ఆయుధాలు వాడకుండా భారత్, చైనా దేశాలే నిరోధించి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యాపై ఈ రెండు దేశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపాయని అన్నారు. జీ 20 సమ్మిట్ కోసం భారతదేశానికి వచ్చే కొన్ని రోజులముందు బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Hong Kong Model Case: హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ దారుణంగా హత్యకు గురైంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు. తైపో జిల్లాలోని ఓ ఇంట్లో ఆమె కాళ్లను ఓ ఫ్రిజ్ లో ఉంచారు, ఆమె మృతదేహంతో పాటు మాంసం ముక్కలు, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను ఇంట్లో హాంకాంగ్ పోలీసులు గుర్తించారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో పొత్తు కాదనుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో చేరారని…
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
Congress: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీ జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఎన్నికల్లో మాత్రమే సాయపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు భావసారుప్యత కలిగిన లౌకిక పార్టీలతో, విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని అని వెల్లడించింది.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి విరమణ చేయడాన్ని ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు అని ఆమె అన్నారు. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిస్తుంది అని అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం మరియు సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూపించిందని అన్నారు.
Amritpal Singh: ఖలిస్తానీ సానుభూతిపరులు పంజాబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలో ఆయన మద్దతుదారుడు టూపాన్ సింగ్ అరెస్ట్ ను నిరసిస్తూ అంజాలాలోని పోలీస్ కాంప్లెక్స్ పై దాడులు చేశారు. అమృత్ పాల్ సింగ్ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా టూఫాన్ సింగ్ ను విడుదల చేయడానికి పోలీసులు అంగీకరించారు. ఇదిలా ఉంటే ఆయన ఖలిస్తాన్ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్తాన్ సెంటిమెంట్ అలాగే ఉంటుందని, దాన్ని ఎవరూ అణచివేయలేరని అన్నారు.
Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు.
PM Narendra Modi: కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంగా ఉపయోగించుకుందని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. శుక్రవారం ఆయన నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాలను ‘‘ అష్ట లక్ష్మీ’’లుగా భావిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
World's Oldest Toilet: ప్రపంచంలోనే అత్యంత పురాతమైన ఫ్లషింగ్ టాయిలెట్ బయటపడింది. చైనా పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2400 ఏళ్ల నాటి టాయిటెల్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని జియాన్ నగరంలో ఓ పురావస్తు ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో టాయిలెట్ బాక్స్, పైపును పరిశోధకులు కనుక్కున్నారు. ఈ టాయిలెట్ యుయాంగ్ లోని ఒక ప్యాలెస్ శిథిలాల్లో కనుగొనబడింది. ఇది వారింగ్ స్టేట్స్ కాలం(424 BC), క్విన్ రాజవంశం (221 BC - 206 BC) నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు.