IPS D Roopa Moudgil Facebook latest post: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల రచ్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. రోహిణి సింధూరి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసిన రూపా, ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ల మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా ఆమె మెంటల్ కండీషన్ సరిగా లేదంటూ రోహిణి కామెంట్ చేశారు.
Read Also: T20 World Cup: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్
ఇదిలా ఉంటే మరోసారి రూపా మౌడ్గిల్ ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. నా కుటుంబం కోసం పోరాటం చేస్తున్నా అని బుధవారం పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కనీస జాగ్రత్తలు పాటించపోవడం వల్ల తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి, కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి, మరో అధికారి ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఓ ఐఏఎస్ జంట విడాకులు తీసుకుందని, అందకే నేను జాగ్రత్త పడుతున్నా అంటూ పోస్టులో పేర్కొంది. నేను, నా భర్త కలిసే ఉన్నాం, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాడుతున్నా అని, పలువురు జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు అంటూ రాసుకొచ్చింది. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే అవినీతిపై చేసే పోరుకు ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలని అని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు అధికారులను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారం కర్ణాకట విధాన పరిషత్తులో కూడా చర్చకు వచ్చింది. పలువురు ప్రజాప్రతినిధులు దీనిపై మాట్లాడటం గమనార్హం. ఇద్దరూ కూడా ఎలాంటి బహిరంగ పోస్టు పెట్టవద్దని సీఎస్ వందితా శర్మ ఇప్పటికే ఆదేశించారు. అయినా కూడా రూపా మౌడ్గిల్ పోస్టు పెట్టారు.