Nitish Kumar: బీహర్ సీఎం ముఖ్య అతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగం చేస్తున్న ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్తను సీఎం నితీష్ కుమార్ వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెబుతూ అమిత్ కుమార్ అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రప్రభుత్వం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
Sadhvi Prachi On Swara Bhasker Marriage: బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. దీనిపై ఇటు హిందూ, అటు ముస్లిం వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ కాలక వ్యాఖ్యలు చేశారు.
Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు.
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు.
Joe Biden: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
Roopa vs Rohini: కర్ణాటకలో కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు తమ పదవులను మరిచి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి పోస్టింగులు ఇవ్వలేదు.
Tomato Shortage: ఆర్థిక మందగమనంతో ఇప్పటికే యూకే ఇబ్బందులు పడుతోంది. రానున్న రోజుల్లో ఆర్థికమాంద్యం తప్పదా అనే అనుమానాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ దేశాన్ని టొమాటోల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం యూకేలోని సూపర్ మార్కెట్లలో టొమాటో స్టాల్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Biden's top secret visit to Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో చలి కాలం ముగింపుకు రావడంతో రానున్న కాలంలో రష్యా మరింతగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇటు అధికారులకు కానీ అటు మీడియాకు కానీ ముందస్తు సమాచారం లేకుండా అత్యంత రహస్యం పర్యటన…
Physical Assault on A Minor Girl: దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలకు, అత్యాచారాలకు అడ్దుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నయ్యనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ఘటనలో ఫిర్యాదు నమోదైంది.
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది.